Pawan Kalyan : టీడీపీ, జనసేన పొత్తుని దీవించండని బీజేపీ నాయకత్వానికి విన్నవించా..
టీడీపీ అధినేత చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. యువగళం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ..
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)ను అన్యాయంగా జైల్లో పెట్టారని జనసేన(Janasena) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. యువగళం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. తాను ఏమి ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదని.. టీడీపీ కష్టాల్లో ఉంది కాబట్టే మద్దతు ఇచ్చానని తెలిపారు. 2019లో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వలన టీడీపీకి దూరం అయ్యాము. 2024లో మళ్ళీ టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని మరొమారు స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తులో ఉండి కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి కారణాలు బీజేపీ(BJP) జాతీయ నాయకత్వానికి వివరించామని తెలిపారు మా టీడీపీ, జనసేన పొత్తుని దీవించండి అని అమిత్ షా(Amitshah)కు విన్నవించానని.. వారి నిర్ణయం ఎలా ఉంటుందో మనకి తెలియదన్నారు.
సోనియా గాంధీ(Soniya Gandhi) జైల్లో పెడితే చంద్రబాబుపై కక్ష చూపారని ఆరోపించారు. జగన్(Jagan)ను సోనియా గాంధీ జైల్లో పెట్టించారని.. ఆ కక్ష చంద్రబాబు మీద చూపడం చాలా అవివేకం అని అన్నారు. చంద్రబాబును జైలులో పెడితే బాధ కలిగిందన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని అనుకున్నా.. ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదన్నారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. జగన్‌ను ఇంటికి పంపుతాం అని వ్యాఖ్యానించారు.