Pawan Kalyan : పీఠాపురం చుట్టే చక్కర్లు కొడుతున్న పవన్...ఓటమి భయం పట్టుకుందా?
రాజకీయపార్టీల అధినేతలకు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నికల వేళ తనవాళ్లందరినీ గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత అధ్యక్షులదే! ఎంతసేపూ తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే ఉంటే మరి మిగతావారు ఏం కావాలి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం(Pithapuram)లో ఇదే జరుగుతోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan) అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి పవన్‌కు విజయం చాలా అవసరం. అందుకే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారాయన! తన సామాజికవర్గంవారు ఎక్కువగా ఉంటారనే భరోసాతో అక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు పవన్. కానీ […]
రాజకీయపార్టీల అధినేతలకు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నికల వేళ తనవాళ్లందరినీ గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత అధ్యక్షులదే! ఎంతసేపూ తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే ఉంటే మరి మిగతావారు ఏం కావాలి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం(Pithapuram)లో ఇదే జరుగుతోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan) అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి పవన్‌కు విజయం చాలా అవసరం. అందుకే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారాయన! తన సామాజికవర్గంవారు ఎక్కువగా ఉంటారనే భరోసాతో అక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు పవన్. కానీ బరిలో దిగిన తర్వాత ఆయనకు పరిస్థితి అర్థమయ్యింది. విజయం అంత ఈజీ కాదని తెలిసిపోయింది. అందుకే ఇప్పటికే అయిదారుసార్లు తనే స్వయంగా ప్రచారం చేసుకున్నారు. పులివెందుల(Pulivendula)లో జగన్(YS Jagan) ఇన్నిసార్లు తిరగలేదే? కుప్పంలో చంద్రబాబు ఇంతగా ప్రచారం చేసుకోవడం లేదే? జగన్ కానీ, చంద్రబాబు(Chandrababu) కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడుతున్నారు. పవన్‌కల్యాణ్ మాత్రం పిఠాపురాన్ని వదలడం లేదు. గెలుపుపై నమ్మకం సన్నగిల్లడంతోనే పవన్ ఇంతగా కష్టపడుతున్నారనే టాక్ పిఠాపురంలో వినిపిస్తోంది. తను పిఠాపురంలోంచి పోటీకి దిగినప్పుడు లక్ష మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వంగా గీత(Vanga Geetha)కు అనుకూలవాతావరణం ఏర్పడుతోంది. పవన్ ఆందోళన చెందడానికి ఇదే కారణం. అందుకే ఇవాళ కూడా పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొనబోతున్నారు. మొత్తంమీద పిఠాపురంపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.