ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మరో మూడు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మరో మూడు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో మొదటిది హరహర వీరలమల్లు(HaraHaraVeeramallu), రెండోది ఓజీ(OG), మూడోది ఉస్తాద్‌ భగత్‌సింగ్‌(UstaadBhagatSingh). ఈ మూడు సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్‌ అనుకుంటున్నారు. కాకపోతే కొన్ని కండీషన్లు పెట్టారు. సినిమాల షూటింగ్‌ మంగళగిరి చుట్టుపక్కలే ఉండాలి. అక్కడ సెట్‌ వేసుకుని అక్కడే చేయాలి. పైగా రోజుకు రెండు మూడు గంటల కంటే ఎక్కువ సేపు షూటింగ్‌ చేయకూడదు! మునుపటిలా కాదు, ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ చాలా బిజీ. మూడు శాఖలకు పవన్‌ మంత్రి కాబట్టి సహజంగానే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి. డిప్యూటీ సీఎం కాబట్టి ప్రభుత్వ వ్యవహారాలపై కూడా దృష్టి పెట్టాలి. అందుకే సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించడం కుదరడం లేదు. హైదరాబాద్‌లో షూటింగ్‌ అంటే చాలా కష్టం. ప్రభుత్వ పనులను పక్కన పెట్టేసి మంగళగిరి(Mangalagiri)కి రావాల్సి వుంటుంది. అదే షూఇంగ్‌ మంగళగిరి చుట్టుపక్కల పెట్టుకుంటే ఈజీగా షూటింగ్‌కు అటెండ్‌ అవ్వొచ్చు. ముందు హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించుకుని, తర్వాత హీరోకు సంబంధించి క్లోజప్‌ సీన్లు మాత్రమే పెండింగ్‌లో పెట్టుకుని ప్రిపేర్‌ అయితే వేగంగా షూటింగ్‌ పూర్తి చేయవచ్చన్నది పవన్‌కల్యాణ్‌ ఆలోచన! హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఆల్‌మోస్టాల్‌ చివరి దశకు చేరుకున్నాయి. వీటికి ఢోకా లేదు కానీ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాకు మాత్రం 60 రోజుల నుంచి 80 రోజుల వరకు డేట్స్‌ కావాల్సి ఉంటుంది. మరి దీన్నిఎలా పూర్తి చేస్తారో చూడాలి!

ehatv

ehatv

Next Story