Pawan kalyan Silent : నోరు కట్టేసుకున్న పవన్ కల్యాణ్
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS jagna) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిక్‌ప్యాకెటింగ్ జరిగినా గొంతు చించుకుని అరిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఇప్పుడు సైలెంటయ్యారు.
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS jagna) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిక్‌ప్యాకెటింగ్ జరిగినా గొంతు చించుకుని అరిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఇప్పుడు సైలెంటయ్యారు. డిప్యూటీ సీఎం పదవి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న ఆరాచకాలు ఆయన కంటికి కనిపించడం లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏ చిన్న విషయం జరిగినా ప్రెస్‌మీట్ పెట్టి గాయ్‌గత్తర చేసిన పవన్ కల్యాణ్
ఇప్పుడు దేనికీ రియాక్టవ్వడం లేదు. పిఠాపురంలో(Pithapuram) ఓ స్కూల్‌కు గీజర్, నీటి సదుపాయాలు లేవు వంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద సమస్యలను పవన్ పట్టించుకోవడం లేదు. 2109లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ఇసుక కొరత ఏర్పడింది. పైగా వర్షాల సీజన్ కావడం వల్ల ఇసుక దొరకుండా అయ్యింది. అంతే.. పవన్ ఆగమేఘాల మీద విశాఖపట్నంలో ల్యాండయ్యారు. భవన నిర్మాణరంగం కార్మికులతో ర్యాలీ తీశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వర్తమానంలోకి వస్తే మూడు నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక రేట్లు భయంకరంగా పెరిగాయి. అదేమిటీ ఉచిత ఇసుక అని చంద్రబాబు(Chandrababu) అన్నారుకదా అనే డౌటానుమానాలు ఏదైనా ఉంటే పక్కన పెట్టేయండి. ఇంత జరుగుతున్నా పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. ఏమైనా అంటే చంద్రబాబు నొచ్చుకుంటారన్న భయం కావొచ్చు. ఇప్పుడు కూడ భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారుగా! వై.ఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతున్నదని, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పవన్ తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అదుపుతప్పాయన్నది నిజం! మొన్న కడప జిల్లాలో జరిగిన ఘటనపై అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా రియాక్టయ్యింది. బీజేపీ కూడా స్పందించింది. పవన్ కల్యాణ్ మాత్రం సైలెంట్! ఇలా చాలా సమస్యలపై పవన్ నోరు విప్పడం లేదు. ఏ మాత్రం పట్టనట్టుగా ఉంటున్నారు.