ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు హఠాత్తుగా సనాతన ధర్మం గుర్తుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(AP Deputy CM Pawankalyan)కు హఠాత్తుగా సనాతన ధర్మం గుర్తుకొచ్చింది. తిరుమల లడ్డూ విషయంలో ఆవేశం తన్నుకొని వచ్చేసింది. దాంతో పాటుగానే ఆగ్రహం ఆవహించింది. దాంతో ఏదేదో మాట్లాడేశారు. సనాతన ధర్మం కూడా ప్రాణాలు కూడా ఇస్తానంటూ బరువైన డైలాగులు కూడా చెప్పారు. అదే ఫ్లోలో ఏ తప్పు చేయని, తప్పుగా మాట్లాడని, అసలు ఏ సంబంధమూ లేని తమిళ హీరో కార్తీ(Tamil Hero Karthik)ని లడ్డూను అపహాస్యం చేయవద్దని హెచ్చరించారు. పవన్‌ చేసిన ఈ కామెంట్‌ బూమరాంగ్‌ అయ్యింది. పవన్‌ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూలంగా ఉండే సోషల్‌ మీడియా గ్రూపులు చెప్పాయి. కార్తీ విషయంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని అన్నాయి. ఎందుకొచ్చిన గొడవ అనుకున్న కార్తీ చాలా పద్దతిగా పవన్‌కు క్షమాపణలు చెప్పారు. నిజానికి సారీ చెబుతూ తన మాటలను అపార్థం చేసుకున్నారని కార్తీ చెప్పారు. దాంతో పవన్‌కు తను చేసిన తప్పేమిటో అర్థమయ్యింది. కార్తీ ఇచ్చిన మూడు లైన్ల వివరణకు సమాధానం ఇవ్వడానికి పవన్‌కు 30 లైన్లు అవసరమయ్యాయి. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం పవన్‌ ఆలస్యంగా చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడైతే పెద్దగా పట్టించుకోలేదు కానీ తమిళనాడులో అయితే పవన్‌ను మామూలుగా ఆడుకోలేదు. సోషల్‌ మీడియాలో పవన్‌ను ఉతికి ఆరేశారు. కార్తీని అనడానికి అసలు పవన్‌కు ఏం అర్హత ఉందని నిలదీశారు. అదే సమయంలో గతంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలను, ప్రవచనాలను బయటకు తీసుకొచ్చారు. క్రిస్టియన్లు తనకు బాప్టిజం ఇచ్చారని, అ మతంలో ఎంతో కొంత మంచి వుండడం వల్లే ఎంతో మంది అటు అకర్షితులు అవుతున్నారని వపన్‌ చెప్పుకొచ్చిన వీడియోను ట్రోల్‌ చేశారు. . జ‌గన్(YS Jagan)కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పా? పవన్ భార్య, పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కాదా? అని నిలదీస్తున్నారు. అసలు పవన్ కు కార్తీ సారీ చెప్పడం ఏమిటి? అది కూడా చేయని తప్పుకు అంటూ నిలదీశారు నెటిజన్లు. పైగా దీక్ష అని చెప్పి, దీక్షా వస్త్రాలు ధరించి షూటింగ్ చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు.

ehatv

ehatv

Next Story