గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు

చట్టం ఎవరికీ చుట్టం కాదు

గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు

అల్లు అర్జున్ ఎపిసోడ్‌‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లాల్సి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమని పవన్ అన్నారు.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, సినీనటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారని వ్యాఖ్యానించారు.

హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పవన్ మాట్లాడుతూ గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమన్నారు. రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడని, కింద నుంచి ఎదిగారన్నారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని తెలిపారు. అక్కడ బెన్‌ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారన్నారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారన్నారు. అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది వెలకట్టలేమన్నారు. ‘‘మేము సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశాము. ఇటువంటి ఘటనల్లో‌ పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టను అంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు. చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు. నేనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం. అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయం. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే... ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీం. అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది‌ కరెక్ట్ కాదని నా అభిప్రాయమని పవన్ అన్నారు.

పరిస్థితులు అలా వచ్చాయ్ : అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపీంచిందని అన్నారు. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. అది చేయక‌పోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్టిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని, సీఎం హోదాలో ఆయన స్పందించారన్నారు. రేవంత్ రెడ్డికి రాంచరణ్, అల్లు అర్జున్‌లు చిన్ననాటి నుంచీ తెలుసని..అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా. కానీ కొన్నిసార్లు పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయని ఉపముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

రేవంత్‌ను తప్పు బట్టలేం : సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారు అని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి వీటన్నింటికీ మించిన నాయకుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుష్ప సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచారు. మరి మనం రేవంత్ రెడ్డిను ఎలా తప్పు బడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

క్వాలిటీ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ ఉండాలి : సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలోని వారందరూ కూర్చొని మాట్లాడాలి. రాష్ట్రంలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లు ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలున్నాయి. ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ ఉండాలి. స్టోరీ టెల్లింగ్‌ స్కూల్స్‌ రావాలి. అప్పుడే మంచి సినిమాలు సాధ్యమని పవన్‌కల్యాణ్ అన్నారు.

ehatv

ehatv

Next Story