Varahi Yatra-3 schedule : వారాహి యాత్ర-3 షెడ్యూల్ ఫిక్స్ చేసేందుకేనా.. ప్రత్యేక విమానంలో వెళ్లింది..?
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) గన్నవరం చేరుకున్నారు. సోమవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో(Gannavaram Airport) పవన్ కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయంకు బయలుదేరి వెళ్లారు. పార్టీ కార్యాలయంలో శ్రేణులతో వారాహి యాత్ర -3 షెడ్యూల్‌పై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు.

పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఇప్పటికే రెండు విడతల్లో పూర్తయింది. జూన్ 14న కత్తిపూడి నుంచి ప్రారంభమైన మొదటి విడత యాత్ర అదే నెల 30న భీమవరం సభతో ముగిసింది. ఉమ్మడి జిల్లాల్లో పది నియోజకవర్గాలను పవన్ తన మొదటి పర్యటన ద్వారా కవర్ చేశారు. ఆ తరువాత రెండో విడత వారాహి విజయ యాత్ర జూలై 9న ఏలూరులో ప్రారంభమై 14వ తేదీన తణుకు సభతో ముగిసింది. తాజాగా మూడో విడత వారాహి విజయ యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఆగస్టు 3, 5 తేదీల్లో మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ఉంటుందా లేక పశ్చిమ గోదావరి నుంచి మొదలు పెడతారా.. వేరే ముహూర్తం, తేదీ ఫిక్స్ చేస్తారా అనే విషయమై స్పష్టత రావాల్సివుంది.