తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన(Janasena) కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి. నెల రోజుల కిందట రాజమండ్రి సెంట్రల్‌ జైలు(Rajahmundry central jail) సాక్షిగా ఈ విషయాన్ని జనసేనాని పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) ప్రకటించారు. దీనికి కార్యరూపం దాలుస్తూ నిన్న రాజమండ్రిలో రెండు పార్టీలకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశమయ్యింది. ఎలా కలిసి పని చేయాలి? ఏ రకంగా ప్రజలలోకి వెళ్లాలి? ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి?

తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన(Janasena) కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి. నెల రోజుల కిందట రాజమండ్రి సెంట్రల్‌ జైలు(Rajahmundry central jail) సాక్షిగా ఈ విషయాన్ని జనసేనాని పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) ప్రకటించారు. దీనికి కార్యరూపం దాలుస్తూ నిన్న రాజమండ్రిలో రెండు పార్టీలకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశమయ్యింది. ఎలా కలిసి పని చేయాలి? ఏ రకంగా ప్రజలలోకి వెళ్లాలి? ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి? ఏ విధంగా ప్రజలను ఒప్పించాలి? అనే విషయాలపై కమిటీ చర్చింది. టీడీపీ-జనసేన కూటమిని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలన్నదానిపై కూడా కమిటీ చర్చించింది.

త్వరలోనే మళ్లీ సమావేశమవుతామని సమన్వయ కమిటీ ఈ సందర్భంగా తెలిపింది. వచ్చే ఎన్నికల్లో ప్రచారాన్ని ఉమ్మడిగానే నిర్వహిస్తామని చెప్పింది. ప్రతి ఇంటికి వెళతామని, ప్రతి మనిషిని కలుస్తామని వెల్లడించింది. టీడీపీ-జనసేన కూటమి ఎందుకో వారికి వివరిస్తామని తెలిపింది. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి పని చేయడానికి కసరత్తు చేస్తున్నట్టుగా నిన్నటి సమన్వయ కమిటీ మీటింగ్‌ను బట్టి మనకు అర్థమవుతోంది. మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి? బీజేపీ(BJP) కూడా జనసేన పొత్తులో ఉంది.

బీజేపీతోనే ఉంటానని పవన్‌ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు కూడా! మూడేళ్లుగా ఈ రెండు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. పొత్తు కుదిరిన సందర్బంలో రెండు పార్టీలు సమన్వయ కమిటీని కూడా వేసుకున్నాయి. కలిసి పని చేయాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకుంటామని టీడీపీ, బీజేపీలు చెప్పాయి. కానీ రెండు పార్టీలు కలిసి ఏ కార్యక్రమాన్ని చేపట్టలేదు. పవన్‌ మాత్రం బీజేపీతో కలిసే పని చేస్తానని చెప్పారు.

వారాహికి పూజలు చేస్తున్నప్పుడు కూడా బీజేపీతోనే ఉన్నామని, బీజేపీతోనే కలిసి నడుస్తామని పవన్‌ చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీడీపీతో పొత్తును అనౌన్స్‌ చేశారు. ఇదే సమయంలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నానని ఎక్కడా చెప్పలేదు. పైగా ఢిల్లీలో జరిగిన ఎన్డీయే మీటింగ్‌లో పాల్గొన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏపీకి ఎన్డీయే ముఖ్యమంత్రి కాబోతున్నారని పవన్‌ చెప్పారు. నిన్నేమో టీడీపీ, జనసేన కూటమికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అసలు ఏమిటీ గందరగోళం? దేనికి ఈ అయోమయం? ఈ సందేహాల నివృతి కోసం ఈ వీడియో చూడండి.

Updated On 24 Oct 2023 5:34 AM GMT
Ehatv

Ehatv

Next Story