ఈ మధ్య పవన్‌ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో పవర్‌ షేర్‌(Power share) జరగనుందా అనే వార్తలు తెరపైకి వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు(chandrababu) పదవీ బాధ్యతలు, డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. ఎన్నికలకు ముందు పొత్తు ఏర్పర్చుకునే విషయంలో జనసేన(Janasena) అధినేత కీలక పాత్ర పోషించారు. స్కిల్‌ స్కాం కేసులో(Skill development case) చంద్రబాబును అరెస్ట్‌ చేయడంతో పరామర్శకు వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ అదే సమయంలో పొత్తుపై ప్రకటన చేశారు. దీంతో ఏపీలో రాజకీయం(AP Politics) ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీతో(BJP) పొత్తులో కూడా పవన్‌ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల్లో ఈ కూటమి అనూహ్య విజయాన్ని అందుకుంది. ఏకంగా 175 స్థానాల్లో 164 స్థానాలు గెల్చుకొని వైసీపీని చావుదెబ్బకొట్టింది.

అయితే ఈ మధ్య పవన్‌ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో పవర్‌ షేర్‌(Power share) జరగనుందా అనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఏపీలో శాంతిభద్రతలు, మహిళలపై అత్యాచారాలు(rapes) పెరిగిపోవడంతో పవన్‌ కల్యాణ్‌ కొంత అసహనంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పారు. హోంమంత్రి అనిత వెంటనే చర్యలు చేపట్టాలని పోలీసులు కూడా శాంతి భద్రతల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. మీకు చేతగాకపోతే నేను బాధ్యతలు తీసుకుంటానన్నారు. దీంతో పవన్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో(amit shah) తొలిసారి పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 2027లో జమిలి ఎన్నికలు(Jamili elections) జరుగుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఏపీలో పవన్‌ షేరింగ్‌పై చర్చకు తెరలేపింది. పవర్ షేరింగ్‌పై ఎందుకు చర్చ జరుగుతోందంటే టీడీపీకి సంబంధించిన మీడియాలో పవన్ అమిత్ షాతో కలిసిన వార్తకు చాలా లీస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అంటే టీడీపీ మీడియాకు నచ్చని అంశం అక్కడ ఏదో జరిగే ఉంటుందనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. లేదంటే చిన్నవార్తను పెద్ద అక్షరాలతో పేజీ నిండా నింపే టీడీపీ మీడియా.. పవన్‌, అమిత్ షా భేటీని ఎందుకంత తక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది చర్చ. ఎన్నికలకు ముందు కూడా పవన్‌కు పవర్‌ షేర్‌ చేయాలన్న వాదనలు వినిపించాయి. 2027లో జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో పవర్‌ షేరింగ్‌పైనే ఈ చర్చ జరిగిందా అనే ప్రచారం కూడా జరుగుతోంది.



Updated On 7 Nov 2024 10:02 AM GMT
Eha Tv

Eha Tv

Next Story