Pawan Kalyan : ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తాం
టీడీపీ-జనసేన-బీజేపీ కలిసే పోటీ చేస్తాయనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య అండర్‍స్టాడింగ్ ఇష్యూ ఉందని.. వాళ్ల మధ్య సమస్యలపై మాట్లాడలేనని.. కానీ ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తామని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనేది మా విధానమన్నారు.

Pawan Kalyan made key comments on alliances
టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) కలిసే పోటీ చేస్తాయనుకుంటున్నానని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య అండర్‍స్టాడింగ్ ఇష్యూ ఉందని.. వాళ్ల మధ్య సమస్యలపై మాట్లాడలేనని.. కానీ ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తామని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వైసీపీ(YSRCP) వ్యతిరేక ఓటు చీలిపోకూడదనేది మా విధానమన్నారు. 2014లో కలిసే పనిచేశాం.. 2019లో విడిపోయామన్నారు. 2020లో బీజేపీ-జనసేన ఒకే వేదికపైకి వచ్చాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థి(CM Candidate)పై స్పష్టత వస్తుందన్నారు. మా ప్రాధాన్యత వైసీపీని ఓడించి రాష్ట్రాన్ని డెవలప్ చేయడం.. సీఎం ఎవరనేది సమస్య కాదు. జనసేన కేడర్ నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. మౌలికవసతులు కల్పించడంలో వైసీపీ విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు లేక, పనులు చేయడానికి ముందుకు రావడం లేదని అన్నారు. జనసేన ప్రశ్నిస్తోందని.. ప్రజల మద్దతు కూడగడుతోందని తెలిపారు. ఏపీ(AP)లో అభద్రత, శాంతిభద్రతల సమస్యలు ఉన్నాయన్నారు.
తాజా మీటింగ్ సీనియర్ మంత్రుల నేతృత్వంలో జరగబోతుందని తెలిపారు. ఎన్డీఏ విధానాలు ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లే విషయమై చర్చించే అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, రాజకీయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. మరిన్ని పొత్తులపైనా ఈ సమావేశంలో స్పష్టత రావచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
