Janasena Poster : సిద్ధంకు పోటీగా జనసేన మేము సిద్ధమే! చివరకు పోస్టర్‌ను కూడా కాపీ కొట్టేశారు!
ఒకప్పుడు ఓ సినిమా విజయం సాధిస్తే ఆ సినిమా టైటిల్‌ను పోలిన అయిదారు డబ్బింగ్ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(AP CM Jagan) ఎన్నికలకు సంసిద్ధమయ్యారు. సిద్ధం(Siddham) అనే నినాదంతో సమరశంఖాన్ని పూరించారు. సిద్ధం సభలకు సంబంధించి ఊరూరా పోస్టర్లు వెలిశాయి. సిద్ధం నినాదం ప్రజలకు ఆకట్టుకుంటోంది. భీమిలిలో నిర్వహించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ(Public meeting) బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది.

Janasena Poster
ఒకప్పుడు ఓ సినిమా విజయం సాధిస్తే ఆ సినిమా టైటిల్‌ను పోలిన అయిదారు డబ్బింగ్ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(AP CM Jagan) ఎన్నికలకు సంసిద్ధమయ్యారు. సిద్ధం(Siddham) అనే నినాదంతో సమరశంఖాన్ని పూరించారు. సిద్ధం సభలకు సంబంధించి ఊరూరా పోస్టర్లు వెలిశాయి. సిద్ధం నినాదం ప్రజలకు ఆకట్టుకుంటోంది. భీమిలిలో నిర్వహించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ(Public meeting) బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. వైసీపీ ఇలా దూసుకువెళుతుంటే, మనం గమ్మున ఉంటే బాగోదనకున్న జనసేన మేము సిద్ధమే అంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోంది. వైసీపీ సిద్ధం అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరితే, తామేం తక్కువ తిన్నామా అని జనసేన ముము సిద్ధమేనని బదులిస్తోంది. పవన్ కల్యాణ్‌కు(Pawan kalyan) రీమేక్‌లు చేయడం అలవాటు కాబట్టి వైఎస్‌ఆర్ పోస్టర్‌ను కూడా రీమేక్ చేశారు. ఈ పోస్టర్‌లో వంగవీటి మోహనరంగా ఫోటోను కూడా ప్రచురించారు. గమనించదగిన విషయమేమింటే మేము సిద్ధమే పోస్టర్‌లో చంద్రబాబునాయుడు, లోకేశ్ ఫోటోలు లేకపోవడం!అంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు జనసేనకు మాత్రమే ఉన్నాయని చెప్పకనే చెప్పింది! తమను సంప్రదించకుండా, పొత్తుధర్మాన్ని పాటించకుండా జనసేన ఇలా చేయడం బాగోలేదని తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు గులుక్కుంటున్నారు.
