జనవాణి కార్యక్రమంలో అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వడం లేదని అన్నారు,

జనవాణి(Janavani) కార్యక్రమంలో అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయని జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల(Contract Employees)కు సరిగా జీతాలు ఇవ్వడం లేదని అన్నారు, కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా ఐఏఎస్‌IAS)లకు జీతాలు వస్తాయి. రాష్ట్రాన్ని నడిపే అధికారులకు కూడా 20వ తేదీ వరకు జీతాలు రావట్లేదని.. ఐఏఎస్‌లకూ సకాలంలో జీతాలివ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

కొల్లేరు(Kolleru) నీటి సమస్య చాలా బాధ కలిగించిందని అన్నారు. కైకలూరు(Kaikaluru), ఉండవల్లి(Undavalli), ముదినేపల్లి(Mudinepalli)లో నీటి సమస్య తీవ్రంగా ఉందని.. కొల్లేరు సరస్సులో 17 వేల టన్నుల వ్యర్థాలు చేరుతున్నాయని.. కొల్లేరు సరస్సుకు సంబంధించి చాలా ఆక్రమణలు ఉన్నాయని ఆరోపించారు. ఏపీ(AP)లో పరిస్థితి బాగా లేదని అన్నారు.

మేం ఎక్కడ పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటాం అనేది వైసీపీ(YSRCP)కి అనవసరం అన్నారు. మేం ప్రజలకు మాత్రమే సమాధానం చెబుతామ‌న్నారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి కావాల్సిన కాజు(Kaaju), కొబ్బరి(Kobbari) బోర్డుల గురించి ఏనాడు విజ్ఞప్తి చేయలేదని అన్నారు. ఎన్డీఏతో పొత్తులోనే ఉన్నాం.. ఎన్డీఏ(NDA) భేటీకి హాజరయ్యామ‌ని స్ప‌ష్టం చేశారు. 2024లో టీడీపీ(TDP), బీజే(BJP), జనసేన కలిసి పోటీ చేయాలనేది నా ఆకాంక్ష అని తెలిపారు. జీ-20 సదస్సు జరుగుతున్న సమయంలో చంద్రబాబు అరెస్టు దుర్మార్గం అని అన్నారు. కేంద్రం దృష్టి లేని సమయంలో చంద్రబాబు(Chandrababu)ను అరెస్టు చేశారని ఆరోపించారు.

చంద్రబాబు అరెస్టులో జగన్(Jagan) నక్క జిత్తులు ఉపయోగించారని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీని అప్రోచ్ కాలేకపోయాన‌న్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అనే మాటకు కట్టుబడి ఉన్నాన‌న్నారు. కేసుల గురించే జగన్ ఢిల్లీ(Delhi) పర్యటనలు అని అన్నారు. ఉమ్మడి కార్యాచరణలో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నా.. ప్రజలే నా మొదటి ప్రాధాన్యత అని.. మోదీ(Modhi) కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారని అన్నారు. రెండు మూడు రోజుల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామ‌న్నారు. టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన తర్వాత అనిశ్చితి తొలిగి ప్రజల్లో భరోసా వచ్చిందని అన్నారు.

Updated On 6 Oct 2023 8:33 PM GMT
Yagnik

Yagnik

Next Story