జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawankalyan) లెక్కలేనంత మంది అభిమానులుంటారు. ఆ అభిమానుల్లో వీరాభిమానులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మేడిశెట్టి వీరబాబు ఒకరు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన ఈ నవ యువకుడికి సరికొత్త ఆలోచన వచ్చింది.

జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawankalyan) లెక్కలేనంత మంది అభిమానులుంటారు. ఆ అభిమానుల్లో వీరాభిమానులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మేడిశెట్టి వీరబాబు ఒకరు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన ఈ నవ యువకుడికి సరికొత్త ఆలోచన వచ్చింది. తన వివాహ ఆహ్వాన పత్రికలో(Wedding Invitation card) పిఠాపురం నియోజకవర్గానికి పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీలను(Promises) ప్రచురించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వెడ్డింగ్‌ కార్డులో ఓ వైపు పెళ్లికి సంబంధించిన వివరాలు ఉంటే, మరోవైపు జనసేన అధినేత పవన్‌ ఫోటోతో పాటు ఇటీవల గొల్లప్రోలు మండలం చేబ్రోలు బహిరంగసభలో పవన్‌ ఇచ్చిన హామీలను ముద్రించారు. పవన్‌ గెలిచిన తర్వాత పిఠాపురం ఇలా ఉంటుంది అంటూ హెడ్డింగ్‌ పెట్టి హామీలన్నింటినీ రాసుకొచ్చారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.. చేనేత రంగం అభివృద్ధి.. ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం అభివృద్ధి .పర్యాటక కేంద్రంగా చేస్తాం.మత్స్యకారులకు జెట్టీ నిర్మాణం చేపడతాం..కోస్టల్‌ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి..ఇలా అన్ని హామీలను ప్రచురిస్తూ .. చివరన ఇది మా వాగ్దానం గెలిపించుకోవడం మీ బాధ్యత అంటూ శుభలేఖలో కొసమెరుపు ఇచ్చారు.

Updated On 5 April 2024 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story