జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల వ్యూఖాన్ని ప్రారంభించారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పార్టీని పరుగులుపెట్టిస్తున్నారు. తాజాగా పవన్ మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‏లో ఒక కీలకసమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్‏తో పాటు పార్టీకి చెందిన కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు. పవన్ కొన్ని కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వింగ్‏ని ప్రారంభించిన జనసేనాని, పార్టీ ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు.

జనసేన (Janasena ) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఎన్నికల వ్యూఖాన్ని ప్రారంభించారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పార్టీని పరుగులుపెట్టిస్తున్నారు. తాజాగా పవన్ మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‏లో ఒక కీలకసమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్‏తో పాటు పార్టీకి చెందిన కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు. పవన్ కొన్ని కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వింగ్‏ని ప్రారంభించిన జనసేనాని, పార్టీ ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు.

రేస్ అనే ఒక పొలిటికల్ స్ట్రాటజీ టీమ్‏తో పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.. వీరు గత రెండు నెలలుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పరిస్థితి, ఓట్ బ్యాంక్ పర్సెంటేజీపై నిశితంగా అధ్యయనం చేసి పవన్‏కు నివేదిక అందచేశారు. ఈ రిపోర్టులో జనసేనకు అనుకూలంగా ఎన్నో విషయాలు ఉన్నట్టు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పోరాడి వైసీసీని ఓడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రేస్ సంస్థ ఇచ్చిన సూచనలను పాటించాలని జనసేన అగ్రనాయకత్వం అనుకుంటోంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తే మాత్రం పొత్తులో భాగంగా జనసేన 65కు పైగా స్థానాలను డిమాండ్‌ చేయవచ్చని రేస్‌ సంస్థ తన నివేదికతో పేర్కొంది. ఇందులో 80 శాతానికి పైగా స్థానాలను గెలిచే అవకాశం ఉందట. ఏ కారణాల వల్లనో పొత్తు కుదరకపోయినా జనసేనకు వచ్చిన పెద్ద నష్టమేమీ ఉండబోదట. ఒంటరిగా పోటీ చేసినా సునాయసంగా 20 స్థానాలకు పైగా గెల్చుకోవచ్చని రేస్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఏ విధంగా చూసినా పవన్‌ కింగ్‌ మేకర్‌ కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో పవన్‌ కీలక పాత్ర పోషించబోతున్నారు. రేస్‌ సంస్థ ఇచ్చిన నివేదకను పవన్‌ కల్యాణ్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీని ఎన్ని స్థానాలు అడగాలి? పార్టీ బలంగా ఉన్న స్థానాలు ఎన్ని? ఏ అభ్యర్థిని ఎక్కడ్నుంచి బరిలో దింపాలి? ఇత్యాది అంశాలను పార్టీలో చర్చించారు. పవన్‌ కల్యాణ్‌ అడిగినన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా? బేరసారాలకు దిగుతుందా? పవన్‌ బలం ఎంత పెరిగింది? వీటికి సమాధానాలు తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే!

Updated On 27 May 2023 2:26 AM GMT
Ehatv

Ehatv

Next Story