Pawan Kalyan : సినిమాల్లో ఎవరి అభిమాని అయినా సరే.. రాజకీయంగా జనసేనకి మద్దతు ఇవ్వండి
యువతని ఓట్ల కోసం వాడుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ.. నా వంతు సాయం, కృషి, ఒక బలమైన సమాజం కోసం నేను ఉన్నానని తెలిపారు. కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు రిటైర్మెంట్ హబ్ అని పిలుస్తారు. మీరు తలుచుకుంటే మార్పు వస్తుందని అన్నారు.

Pawan Kalyan criticized Kakinada Urban MLA Dwarampudi Chandrasekhar Reddy
యువతని ఓట్ల కోసం వాడుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ.. నా వంతు సాయం, కృషి, ఒక బలమైన సమాజం కోసం నేను ఉన్నానని తెలిపారు. కాకినాడ(Kakinada), ఉభయగోదావరి జిల్లాలు(Godavari Districts) రిటైర్మెంట్ హబ్(Retirement Hub) అని పిలుస్తారు. మీరు తలుచుకుంటే మార్పు వస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది మన నాయకులు సరిగ్గా లేకపోతే అస్తవ్యస్తంగా అయిపోతుంది. స్వలాభం చూసుకుంటే కాకినాడలా సమస్యల్లో ఉంటుందని అన్నారు. నాకు ఈ కౌన్ కిస్కా కాకినాడ గొట్టం ఎమ్మెల్యేతో గొడవ ఏముంది.. క్రిమినల్స్ రాజ్యాలు ఏలితే ఇంతే ఉంటుందని అని ఫైర్ అయ్యారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాకినాడ ఎమ్మెల్యే లాంటి క్రిమినల్స్ కి అండగా ఉంటే మనం ఏం చేయాలని ప్రశ్నించారు. క్రిమినల్స్ కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ ని మార్చేస్తున్నారని ఆరోపించారు. మా జనసైనికులు, మహిళలు, నాయకుల మీద రాళ్ళ దాడి చేశారు ద్వారంపూడి అనుచరులు.. నేను వస్తున్నా అనగానే తూ.గో.జిల్లా అంతా 144 సెక్షన్ పెట్టారని అన్నారు.
ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(Dwarampudi Chandrasekhar Reddy).. నా కోపం అణుచుకోవడం వలనే బతికిబట్టకట్టాడని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే నాకు ఇబ్బంది లేదు.. రౌడీయిజం, లూటీ, కబ్జాలు చేస్తే నా లాంటి వాడు సహించలేడు.. వీళ్ళు మనుషుల్ని సమాజాన్ని కులాలు(Caste)గా విడదీసి రాజకీయం చేస్తూ, ద్వేషాలు పెంచుతున్నారని ఫైర్ అయ్యారు. ఇంకోసారి కులదూషణ చేసావా, రెచ్చగొట్టావా.. ఇక మర్యాదగా చెబుతున్నాను.. పద్దతి మార్చుకో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. అంటూ హెచ్చరించారు.
ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెనుక తిరిగే దళిత, కాపు యువకులకు చెబుతున్నాను.. మీ దళిత డ్రైవర్ ని చంపిన వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC), మీ పథకాలు పీకేసిన ముఖ్యమంత్రి, ఈ డెకాయిట్(Dacoit) వెనుక తిరిగే మీకు.. ఈ విషయాల మీద అవగాహన తెచ్చుకుని నడుచుకోవాలని సూచించారు. క్రైమ్ చేసే వాడు ఏ కులమైనా వదిలేదే లేదు. కాకినాడ అర్బన్ లో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఓడించే బాధ్యత నాది అని ప్రకటించాడు. ఈ రోజు నుండి ఉభయగోదావరి జిల్లాల్లో ఎవడు మీపై గూండాగిరి చేసినా, మీకు అండగా నేనుంటానని అన్నారు.
బాపట్ల(Baptla)లో గౌడ కులానికి చెందిన ఒక పిల్లాడిని రెడ్డి కులం వ్యక్తి తగలపెట్టి చంపేశాడు. వాళ్ళ అక్కను ఏడిపిస్తున్నాడని అడ్డుపడినందుకు ఈ పరిస్థితి. కాకినాడ నుండి పిఠాపురం(Pithapuram) వరకు, గోదావరి జిల్లాల్లో ద్వారంపూడి అనేవాడు ముఖ్యమంత్రి(Cheif Minister) అని చెబుతూ ఉన్నారు. అన్నీ అక్రమాలే.. బలహీనులని పీక్కుతింటున్నాడు.. ఏ మూలకి వెళ్ళినా ఈ డెకాయిట్ దోపిడీలు చేస్తున్నాడని ఆరోపించారు.
ఇక్కడ ఉన్న యువతకు చెబుతున్నాను.. కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు. కాపు రిజర్వేషన్(Kapu Reservations) కోసం ఏ గవర్నమెంట్ లో అయినా ఒకేలా ఉండాలి. మీ ఎదుగుదల కోసం కాపు కులాన్ని వాడుకోవద్దని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దళితులను, గౌడ బిడ్డలను చంపుతుంటే దళిత, గౌడ నాయకులకు కోపం రాలేదా..? బిడ్డ చనిపోతే లక్ష చేతిలో పెట్టి తప్పును కప్పేస్తున్నారని అన్నారు. సినిమాల్లో మీరు ఎవరి అభిమాని అయినా సరే.. రాజకీయంగా మీరు అందరూ జనసేనకి మద్దతు ఇవ్వండని కోరారు.
