Pawan Kalyan : లడ్డూ వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదు
తిరుమల లడ్డుపై వివాదం కొనసాగుతంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు.
తిరుమల లడ్డుపై వివాదం కొనసాగుతంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామని అన్నారు. లడ్డూ వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం సంస్కరణల పేరుతో అనేక మార్పులు చేసిందని.. వైసీపీ పాలనలో 219 ఆలయాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని పవన్‌కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదంపై రాజకీయ లబ్ధి ఉందని వైసీపీ ఆరోపిస్తోందని.. తప్పులు జరుగుతుంటే చేతులు కట్టుకొని కూర్చోలేం అన్నారు. గత ఐదేళ్లలో టీటీడీ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించారు. ఇంత వివాదం జరుగుతుంటే బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. ఇతర మతాల్లో ఇలా అపవిత్రం అయితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.