Pawan Kalyan : ఏపీలో వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత వచ్చేది జనసేన – తెలుగుదేశం ప్రభుత్వమేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి నాల్గవ విడత యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతూ..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎన్నికల తరువాత వచ్చేది జనసేన(Janasena) – తెలుగుదేశం(TDP) ప్రభుత్వమేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. వారాహి(Vaarahi) నాల్గవ విడత యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అవనిగడ్డ(Avanigadda) బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతూ.. సీఎం జగన్(CM Jagan) కురుక్షేత్ర యుద్దం అన్నారు. వైసీపీ(YSRCP) వారు 100మందికి పైగా ఉన్నారు. అందుకే వారిని కౌరవులు అంటున్నాను. మీరు ఓడిపోవడం ఖాయం. మేము గెలవడం ఖాయం. మెగా డీఎస్సీకి అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం అని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 15 సీట్లు వస్తే గొప్పేనని పవన్ అన్నారు.
లాస్ట్ టైమ్ యువత జగన్ ను గుడ్డిగా నమ్మి ఓటేసారు. కాని యువతను, ఉద్యోగులను అందరినీ మోసం చేసారు. 5నుంచి 10 ఏళ్ల మద్య ఉన్న 72 వేల మంది చిన్నారులు చనిపోయారు. 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారు. జగన్ సర్కారు దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.
వైసీపీ ప్రభుత్వ పాలన అద్బుతంగా ఉంటే జనసేన వారాహి యాత్రకు ఇంత స్పందన ఉండదు. నాకు రోడ్లపై రావలసిన అవసరం ఉండదు. ప్రత్యేక హాదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అన్నారనే ప్రధాని మోదీ, టీడీపీలతో విబేధించాను. ఓటు చీలిపోకూడదనే నేను అడుగులు వేస్తున్నాను అంటూ పవన్ స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యం బలం గుర్తించకపోతే మనం బలహీనులుగానే ఉండిపోతాము. నాకు నేలమీద, డబ్బుమీద మమకారం లేదు. ఉంటే మాదాపూర్ లో పది ఎకరాలు కొని పెట్టుకునేవాడిని. కాని ఈ వైసీపీ సన్నాసులు నేను డబ్బు తీసుకున్నానని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ మహమ్మారికి టీడీపీ.. జనసేన వ్యాక్సిన్ మందు. గొంతు దాహం తీర్చేది జనసేన గ్లాసు.. ఒక చోట నుంచి మరో చోటుకు తీసుకువెళ్లేది టీడీపీ సైకిల్.. వైసీపీ ప్యాను తిరగదు. వేద్దామంటే కరెంట్ చార్జీల భయం అని పవన్ చమత్కరించారు. వచ్చే ఎన్నికలకు జనసేన, టీడీపీ కలిసే వెడతాయి.. ఇందులో మరో సందేహం లేదని అన్నారు. యువత భవిష్యత్తు కోసమే నేను ఇక్కడే వున్నానని.. భవిష్యత్తులో మరోసారి వైసీపీ ని రాకుండా చేయడమే మన కర్త్యవ్యమని పిలుపునిచ్చారు. జనసేన, టీడీపీలకు మీరు అండగా ఉంటే.. మీకోసం గొడవ పడే వ్యక్తిని.. సీఎం పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు.