Pawan kalyan Initiation Of Silence : మౌన దీక్ష ముగించిన పవన్
వైసీపీ(YCP) పాలనకు వ్యతిరేకంగా సోమవారం జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) మౌనదీక్షకు(silence) దిగారు. మచిలీపట్నంలోని(Machilipatnam) సువర్ణ కల్యాణ మండపం వద్ద గాంధీ(Gandhi), లాల్ బహదూర్ శాస్త్రిల(Lal Bahadhur Shastri) జయంతి సందర్భంగా చిత్ర పటాలకు పవన్ నివాళి అర్పించారు. అనంతరం రెండు గంటల పాటు దీక్ష చేపట్టారు.
వైసీపీ(YCP) పాలనకు వ్యతిరేకంగా సోమవారం జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) మౌనదీక్షకు(silence) దిగారు. మచిలీపట్నంలోని(Machilipatnam) సువర్ణ కల్యాణ మండపం వద్ద గాంధీ(Gandhi), లాల్ బహదూర్ శాస్త్రిల(Lal Bahadhur Shastri) జయంతి సందర్భంగా చిత్ర పటాలకు పవన్ నివాళి అర్పించారు. అనంతరం రెండు గంటల పాటు దీక్ష చేపట్టారు. మౌన దీక్ష అనంతరం పవన్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై(CM Jagan) తనకు వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మాత్రమే విభేదిస్తున్నానని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించాలనే ఆలోచనలు సరైనవి కాదని అన్నారు.
ఇదిలావుంటే.. పవన్ వారాహి విజయ యాత్ర(Varahi Vijaya Yatra) 4వ విడత నిన్న కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభమైంది. అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ మాట్లాడతూ.. వైసీపీ ప్రభుత్వ పాలన అద్బుతంగా ఉంటే జనసేన వారాహి యాత్రకు ఇంత స్పందన ఉండదని.. నాకు రోడ్లపైకి రావలసిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం. మేము గెలవడం ఖాయం. మెగా డీఎస్సీకి అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 15 సీట్లు వస్తే గొప్పేనని పవన్ అన్నారు.