Pawan Kalyan Divorce : విడాకుల విమర్శలకు పవన్ కల్యాణ్ చెక్!
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ మధ్యనే వారాహితో విజయయాత్ర(Varahi Yatra) చేశారు. మొదటి దశను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. అయితే పవన్ అంటే పడనివాళ్లు, పవన్ వ్యతిరేకులు ఆయనతో రాజకీయంగా విభేదించకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో తొంగిచూస్తుంటారు. ఆయన వైవాహిక జీవితంపై పదే పదే ఆరోపణలు చేస్తుంఆరు.
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ మధ్యనే వారాహితో విజయయాత్ర(Varahi Yatra) చేశారు. మొదటి దశను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. అయితే పవన్ అంటే పడనివాళ్లు, పవన్ వ్యతిరేకులు ఆయనతో రాజకీయంగా విభేదించకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో తొంగిచూస్తుంటారు. ఆయన వైవాహిక జీవితంపై పదే పదే ఆరోపణలు చేస్తుంఆరు. పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవాతో(Anna Lehzinova) విడాకులు(Divorce) తీసుకున్నారంటూ కథనాలు వండి వార్చారు. కొంత కాలంగా వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారని, పిల్లలను తీసుకుని అన్నాలెజినోవా రష్యాకు వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇంట జరిగిన ఫంక్షన్‌లలో అన్నా లెజినోవా కనిపించకపోవడంతో విడాకుల వార్తల ఊతం ఇచ్చినట్టు అయ్యింది. పవన్ కల్యాణ్ అటెండవ్వకపోయినా అన్నా మాత్రం తప్పనిసరిగా వేడుకలకు హాజరయ్యేవారు. వరుణ్ తేజ్(Varun Tej)- లావణ్య త్రిపాఠిల(Lavanya Tripati) ఎంగేజ్‌మెంట్‌లో కూడా పవన్ ఒక్కరే కనిపించారు కానీ ఆయన భార్య అన్నా లెజినోవా కనిపించలేదు. ఆ మధ్య జరిగిన రామ్‌చరణ్-ఉపాసన కూతురు బారసాల ఉత్సవంలోనూ అన్నా కనిపించలేదు. వారాహీ విజయయాత్రకు ముందు పవన్ చేసిన యాగంలో కూడా అన్నా కనిపించలేదు. ఇవన్నీ చూసి విడాకుల కథనాలు అల్లేశాయి కొన్ని వెబ్‌సైట్లు. అయితే ఇందులో వాస్తవం లేదని, పనిగట్టుకుని పవన్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇన్నాళ్లకు తనపై కువిమర్శలు చేసేవారి నోళ్లు మూయించారు పవన్. వరుణ్-లావణ్య పెళ్లికి తన భార్య అన్నాతో పాటుగా హాజరయ్యారు. సోషల్ మీడియాలో పవన్- అన్నా కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొన్న ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కలిసి వెళుతున్న ఫోటో దగ్గర్నుంచి మొదలు పెడితే వరుణ్-లావణ్య వివాహవేడుకలో ఫోటోలు పవన్-అన్నా దంపతులు కలిసే వున్నారని రుజువు చేస్తున్నాయి. 12 ఏళ్ల కిందట వచ్చిన తీన్‌మార్ సినిమాలో పవన్-అన్నా కలిసి నటించారు. ఈ సినిమా వచ్చిన రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప.