Pawan Kalyan Vs Nara Lokesh : టీడీపీ సోషల్ మీడియా VS జనసేన సోషల్ మీడియా..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్‌ను డీ.సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే టీడీపీ డిమాండ్‌కు జనసేన పార్టీ అంతే ధీటుగా.. ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇస్తే.. పవన్‌ను సీఎం చేయాలని జనసేన నేతలు కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలోకి వెళ్తే బాగుంటుందంటున్నారు. నారా లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ అంశంపై సోషల్ మీడియాలో ఈ రెండు పార్టీల మధ్య వైరం.. దావనంలా వ్యాపిస్తోంది. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తలు బూతులు తిట్టుకుంటున్నారు. అసలు చంద్రబాబు స్థాయి ఎక్కడ, పవన్ ఎక్కడ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొంత దూరం వెళ్లి మోడీ లేడు, అందరూ చంద్రబాబు సంకనాకేవాళ్లని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలబు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా ధీటుగానే బదులిస్తున్నారు. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు.. పవన్ ఒక్కడే జగన్‌కు వ్యతిరేకంగా పోరాడాన్నారు. జగన్ బెదిరింపులకు భయపడకుండా ఉండి చంద్రబాబు, లోకేష్‌కు అండగా ఉన్నారని ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వాదిస్తున్నారు. కొందరైతే చంద్రబాబు బెయిల్ కోసం లోకేష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా కాళ్లు మొక్కలేదా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావొస్తోంది. 94 శాతం స్ట్రయిక్ రేటుతో గెలిచారు. కానీ కూటమిలో గత కొంత కాలంగా లుకలుకలు వినిపిస్తున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అన్ని సమస్యలపై స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే తరహా మాటలను మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ డామినేషన్‌ను వారు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. అందుకే లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా నియమించాలని తెరపైకి డిమాండ్ విధిస్తున్నారు. దీంతో జనసేన క్యాడర్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. లోకేష్ డిప్యూటీసీఎం అయితే తమకు అభ్యంతరం లేదని.. కానీ పవన్‌ను సీఎం చేయాలని వారు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.