ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల మధ్య సమావేశం ముగిసింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు, పవన్ స్పష్టతకు వచ్చారు. సీట్ల పంపకాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు పార్టీ అధిష్ఠానం నచ్చజెప్పాల్సి ఉంది. ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్ఠానం […]

ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల మధ్య సమావేశం ముగిసింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు, పవన్ స్పష్టతకు వచ్చారు. సీట్ల పంపకాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు పార్టీ అధిష్ఠానం నచ్చజెప్పాల్సి ఉంది. ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్ఠానం స్పష్టమైన హామీ ఇవ్వనుంది. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ ఆశావహులకు జనసేన పార్టీ నచ్చజెప్పుకోనుంది. టీడీపీ తరహాలోనే తమ పార్టీ ఆశావహులకు కూడా రాజకీయ భవిష్యత్తుపై జనసేన హైకమాండ్ భరోసా ఇవ్వనుంది. ఇరుపార్టీల్లోని ఆశావహులకు నచ్చజెప్పిన తర్వాతే అభ్యర్థుల జాబితాలు ప్రకటించాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించుకున్నారు.

ఈ భేటీ తర్వాత జనసేనకు 25-30 స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని, తమ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నట్లు పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. గతంతో పోల్చుకుంటే.. పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ఆశావహులు సిద్ధమవుతున్నట్లు జనసేనాని వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 శాతం షేర్ ఉండాలని జనసేన కోరుకుంటూ ఉంది. విశాఖపట్నంలో కూడా జనసేన పార్టీ బలంగా ఉండడంతో అక్కడ ఎన్ని స్థానాల్లో పోటీకి దింపుతారనే విషయంలో కూడా చర్చ జరిగింది.

Updated On 4 Feb 2024 5:51 AM GMT
Yagnik

Yagnik

Next Story