జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర బుధవారం పారంభమైంది. యాత్రలో భాగంగా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, సీఎం జగన్, ఆ పార్టీ శ్రేణులపై తన అసహనాన్ని వెళ్లగక్కారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని తనపై కక్షకట్టి పోటీ చేసి గాజువాక, భీమవరంలో ఓడించారని పవన్ అన్నారు.
జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(Varahi Yatra) బుధవారం పారంభమైంది. యాత్రలో భాగంగా కత్తిపూడి(Kathipudi)లో నిర్వహించిన బహిరంగ సభ(Public Meeting)లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ(YSRCP) అధినేత, సీఎం జగన్(CM Jagan), ఆ పార్టీ శ్రేణులపై తన అసహనాన్ని వెళ్లగక్కారు. అసెంబ్లీ(Assembly)లోకి అడుగుపెట్టకూడదని తనపై కక్షకట్టి పోటీ చేసి గాజువాక(Gajuwaka), భీమవరం(Bheemavaram)లో ఓడించారని పవన్ అన్నారు. ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు. దమ్ముంటే ఈసారి తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని సవాల్ విసిరారు. భీమవరంలో ఓట్ల జాబితా కంటే 8 వేల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. అవి ఎక్కడ నుండి వచ్చాయి. అందరూ నా మీద కక్ష కట్టి ఓడించారు. ఈ సారి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ బలమైన సంతకం చేస్తుందన్నారు. 151 సీట్లు ఉన్న పార్టీ ఒక్క సీట్ కూడా లేని జనసేన అంటే ఎందుకు భయపడుతుంది.. ఎందుకు అణచి వేయడానికి ప్రయత్నిస్తుంది? అంటే మన బలం వారికి తెలుసు. వైసీపీకి పోటీ మనమేనని పవన్ కళ్యాణ్ అన్నారు.
జగన్(Jagan) గెలిచాక మనస్పూర్తిగా అభినందనలు చెప్పానని అన్నారు. మంచి పరిపాలన ఇవ్వండని చెప్పానని వివరించారు. కానీ.. తన ఇంట్లొ ఉన్న పిల్లలను కూడా వదలకుండా తిట్టించారని అన్నారు. అంత తప్పు ఏమి చేశాను? ప్రజల కోసం పనిచేయడం తప్పా? అని పవన్(Pawan) ప్రశ్నించారు. వైసీపీ నాయకులు చేసే తప్పుల గురించి మాట్లాడి మాట్లాడి అలుపోచ్చిందని.. వాళ్లు అన్ని తప్పులు చేశారని ఆరోపించారు. గాజువాకలో తనను గెలిపించి ఉంటే కనీసం రిషికొండ(Rishikonda)నైనా కాపాడేవాడినని పవన్ చెప్పారు. అమరావతిలో రైతుల ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి(Amaravathi) రాజధానిని ఎందుకు వ్యతిరేకించలేదని సీఎంను ప్రశ్నించారు. రాజధానిపై కుల ముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో(Elections) ఒక్కడిగా పోటీ చేయండి అంటున్నారు.. ఒక్కడిగా వస్తానా, కూటమిగా వస్తానా.. ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కచ్చితంగా నిర్ణయం తీసుకున్న రోజు.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పి ఎన్నికలకు వెళ్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని వ్యూహాలైనా వేస్తాను.. సీఎం పదవి వస్తే స్వీకరిస్తాను. ముఖ్యమంత్రి పదవి కోసం ఎలా పనిచేయాలి అనే దానిపై దృష్టి పెడదామన్నారు.