ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదని తెలిపారు. ఇప్పుడున్న పథకాలకు అదనంగా డబ్బులు జోడించి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన పలు పథకాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో తప్పుపట్టిన సంగతి తెలిసిందే! ఎన్నో పథకాలను ప్రజలకు ఇస్తూ ఉండడాన్ని తప్పుబట్టారు. తాజాగా ఆయన మాటలో కాస్త మార్పు వచ్చింది. రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదని తెలిపారు. ఇప్పుడున్న పథకాలకు అదనంగా డబ్బులు జోడించి ఇస్తామే తప్ప ప్రస్తుత స్కీములను రద్దు చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

సీఎం జగన్ ఏనాడూ తన జేబు నుంచి ఒక్కరూపాయి కూడా పేద ప్రజలకు ఇవ్వలేదని.. తాను జగన్‌లా కాదని, తన సంపాదన ప్రజలకు పంచిపెట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తేల్చి చెప్పారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఎంత ఉదారంగా ఇవ్వగలమో చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల సమస్యల పరిష్కారానికి అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 226 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామని, పవన్‌ కళ్యాణ్ సొంత నిధుల నుంచి రూ.3.5 కోట్లు అందజేశారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ మరో దఫా చెక్కులు పంపిణీ చేశారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు ఉమ్మడి నిధి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు జనసేన ప్రకటించింది.

Updated On 7 Feb 2024 9:44 PM GMT
Yagnik

Yagnik

Next Story