11 years Girl Organ Donation : చిన్నారి బ్రెయిన్‌డెడ్.. అవయవదానం చేసి మరొకరికి ప్రాణం పోసిన పేరెంట్స్
తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు.
తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. పదకొండేళ్లపాటు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు(Daughter) రోడ్డు ప్రమాదంలో(Road accident) గాయపడి బ్రెయిన్ డెడ్‌గా(Brain dead) మారడంతో వైద్యులు తల్లిదండ్రులను ఒప్పించారు. గారాబంగా పెంచుకున్న కూతురు కళ్ల ఎదుటే జీవచ్ఛవంలా మారిన కూడా కన్నీటిని దిగమింగుకొని అవయవదానానికి అంగీకరించారు తల్లిదండ్రులు. కన్న కూతురు చనిపోతుందని తెలిసి అవయవాలుదానం(Organ donation) చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం(Vizianagaram) జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి (11)తో కలిసి బైక్‌పై ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి వెళ్తుండగా ఎన్.ఆర్.పురం వద్ద బ్రేక్ ఫెయిల్ అయి బైక్ తుప్పల్లో పడింది. వెంకటరమణ కాలుకు, భార్య దేవి చేతికి గాయాలయ్యాయి. స్థానికులు ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కూతురు పల్లవి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు చిన్నారికి బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. పాప అవయవాలు దానం చేసినట్లయితే మరొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని వైద్యులు తల్లిదండ్రులను ఒప్పించారు. చిన్నారి పేరెంట్స్ కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో పల్లవి శరీరం నుంచి రెండు కిడ్నీలు, కళ్లలోని కార్నియాలను సేకరించారు. కిడ్నీలనకు గ్రీన్ చానెల్ ద్వారా అంబులెన్స్‌లో విశాఖ మెడికవర్ ఆస్పత్రికి ఒకటి, కిమ్స్ ఐకాన్‌కు మరొకటి తరలించారు. కార్నియాలను విశాఖ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన తల్లిదండ్రులను వైద్యులు, స్థానికులు ప్రశసించారు.