ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మారిన తర్వాత చెదురుమదురు ఘటనలను జరుగుతాయని అనుకున్నారంతా! కానీ అక్కడ అరాచకం ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మారిన తర్వాత చెదురుమదురు ఘటనలను జరుగుతాయని అనుకున్నారంతా! కానీ అక్కడ అరాచకం ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేదు. పాత క్షక్షలు కావచ్చు, అయిదేళ్లుగా బిగపట్టిన కసి కావచ్చు,.. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైరి శిబిరంపై దాడులు మొదలయ్యాయి. దహనాలు కూడా జరిగాయి. కొన్ని చోట్ల హత్యలు కూడా జరిగాయి. పల్నాడులో(Palnadu) అయితే బీభత్సం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ(TDP) అనుకూల మీడియా(Yellow Media) అయితే ఎలాగూ వీటిని చూపించదు. ఒకవేళ హత్యా ఘటనలను కవర్‌ చేయాల్సి వచ్చినా జరిగింది జరిగినట్టు చెప్పాలి కదా! దారుణ హత్య ఘటనను కూడా తమకు తోచిన విధంగా కవర్‌ చేశారు. అసలు ఈ మర్డర్‌ కంటే ముందే గ్రామాలలో ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని గడుపుతున్నారు. గ్రామాలలో ఎవరూ ఉండకూడదని హుకుం జారీ చేశారట టీడీపీవారు! విత్తనాలు జల్లి, పంట సాగుచేయకూడదు అనే ఆదేశాలు కూడా ఇచ్చారట. దీంతో భయం భయంగా, బిక్కు బిక్కు మంటూ వేరే చోట్ల కాలం గడుపుతూ వస్తున్నారు నెలరోజులుగా.చాలా మంది గ్రామాలు విడిచేసి హైదరాబాద్‌కు వచ్చారు. చాలా మంది రైతు కూలీలు, చిన్న రైతులు హైదరాబాద్‌లో చిన్నాచితక పనులు చేసుకుంటున్నారు. పరాయి పంచల్లో బతుకుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story