AP Assembly Majority: ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన నేత ఎవరో తెలుసా?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నేతలు ఊహించని ఓటమిని
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నేతలు ఊహించని ఓటమిని మూటగట్టుకున్నారు. ఇక భారీ మెజారిటీని ఎవరు దక్కించుకుంటారా అని కూడా జనం ఆసక్తిగా ఎదురు చూశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ.. టీడీపీ యువనేత నారా లోకేష్ కానీ భారీ మెజారిటీతో రికార్డును సాధిస్తారని భావించగా.. గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఆ లిస్టులో టాపర్ అయ్యారు.
గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా 95, 235 ఓట్ల తేడాతో గెలుపొంది భారీ మెజారిటీని అందుకున్నారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాస్-92,401 ఓట్లతో గెలిచారు.. మంగళగిరి నుంచి నారా లోకేశ్- 91,413 ఆధిక్యం సాధించారు. పెందుర్తి నుంచి రమేశ్ (జనసేన)-81,870, నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ (టీడీపీ)-72,489, తణుకు నుంచి రాధాకృష్ణ (టీడీపీ)-72,121, కాకినాడ రూరల్ నుంచి నానాజీ (జనసేన)- 72,040, రాజమండ్రి అర్బన్ నుంచి శ్రీనివాస్ (టీడీపీ)- 71,404, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్- 70,279 ఓట్ల భారీ మెజారిటీని దక్కించుకున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సునామీ సృష్టించిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.