మహాసేన రాజేష్ కు షాక్.. పి.గన్నవరం కూటమి అభ్యర్థి ఎవరంటే?
మహాసేన రాజేష్ కు పి.గన్నవరం సీటును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
మహాసేన రాజేష్ కు పి.గన్నవరం సీటును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై భారీ వివాదం నెలకొంది. మహాసేన రాజేష్ కు సంబంధించిన పాత వీడియోలను సోషల్ మీడియాలోకి తీసుకుని వచ్చారు. హిందువులపై అతడు గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఊహించని విధంగా వైరల్ అయ్యాయి. ఇక జనసేన నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.. ఒకానొక దశలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి మహాసేన రాజేష్ కు వచ్చింది. ఓ దశలో పోటీ చేయడం లేదంటూ స్వయంగా ప్రకటించేశారు మహాసేన రాజేష్. ఇక తాజాగా పి.గన్నవరం నుండి కూటమి తరపున జనసేన బరిలోకి దిగుతోంది.
జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. పి.గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని గిడ్డి సత్యనారాయణకు, పోలవరం స్థానాన్ని బాలరాజుకు కేటాయించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారికి నియామక పత్రాలు అందించారు. పి.గన్నవరం సీటును తొలుత టీడీపీ కోటాలో మహాసేన రాజేశ్ కు కేటాయించారు. ఇప్పుడదే సీటును జనసేనకు బదలాయించారు.