Asaduddin Owaisi : మోదీని ఢీకొట్టే సత్తా కేవలం జగన్‌కు మాత్రమే ఉంది
వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఎంఐఎం చీఫ్ అసవుద్దీన్ అన్నారు. మైనారిటీల హక్కులను పరిరక్షించేది జగన్ మాత్రమేనని కొనియాడారు

Owaisi bats for Jagan, says he will continue Muslim quota in AP
వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఎంఐఎం చీఫ్ అసవుద్దీన్ అన్నారు. మైనారిటీల హక్కులను పరిరక్షించేది జగన్ మాత్రమేనని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో తమ మద్దతు కచ్చితంగా సీఎం జగన్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రాలో టీడీపీ, జనసేన నటులైతే.. దేశం మొత్తానికి మోదీ మహా నటుడని ఎద్దేవా చేశారు.
మోదీని ప్రశ్నించే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే.. మోదీ చేతిలో చంద్రబాబు కీలుబొమ్మ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అవకాశవాది, విశ్వసనీయత లేని నాయకుడని ఒవైసీ ఘాటుగా విమర్శించారు. మోదీని ఢీకొట్టే సత్తా కేవలం జగన్‌కు మాత్రమే ఉందని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లీం మైనారిటీలు అంతా వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
