హైదరాబాద్‎లో(Hyderabad) పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. పంజాగుట్ట(Punjagutta), మలక్‎పేట(malakpet), ఆబిడ్స్(Abids), బషీర్‎బాగ్(Basheerbad), దిల్‌సుఖ్‌నగర్‌(Dilsuknagar), చైతన్యపురి(chaitnyapuri), కొత్తపేట్‌, ఉప్పల్‌, తార్నాక, ఎల్ బీ నగర్ , ఉస్మానియా వర్శిటీ

హైదరాబాద్‎లో(Hyderabad) పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. పంజాగుట్ట(Punjagutta), మలక్‎పేట(malakpet), ఆబిడ్స్(Abids), బషీర్‎బాగ్(Basheerbad), దిల్‌సుఖ్‌నగర్‌(Dilsuknagar), చైతన్యపురి(chaitnyapuri), కొత్తపేట్‌, ఉప్పల్‌, తార్నాక, ఎల్ బీ నగర్ , ఉస్మానియా వర్శిటీ, సీతాఫల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉస్మానియా వర్శిటీ, తార్నాక, అసెంబ్లీ ప్రాంతాలలో ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది.

హైదరాబాద్ సిటీలోనే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ బారీ వర్షం పడింది. అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వర్షం నీటితో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహన రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

మరోవైపు తెలంగాణకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్(Orange Alert) ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో వడగళ్లతో (Hail strome)కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బయటికి వెళ్లేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో గంటకు 40 -50 కిమీ వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

మరోవైపు ఏపీకి కూడా వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.

Updated On 6 April 2023 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story