అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) చేసిన ఓ పెద్ద పొరపాటుకు నిన్నటితో ఏడాది. అదే ఆయనను అధికారం కోల్పోయేలా చేసిందనడంలో సందేహమేమీ లేదు.

అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) చేసిన ఓ పెద్ద పొరపాటుకు నిన్నటితో ఏడాది. అదే ఆయనను అధికారం కోల్పోయేలా చేసిందనడంలో సందేహమేమీ లేదు. ఆ పొరపాటు ఏమిటంటే టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడును(Chandrababu) అరెస్ట్ చేయడం! స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో(Skill development case) చంద్రబాబు అరెస్ట్ అయి నిన్నటితో ఏడాది పూర్తయ్యింది. ఆ రోజున ప్రతిపక్ష నేతగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం దగ్గరకు సీఐడీ పోలీసులు చేరుకుని ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. . బస్సులో బస చేసిన చంద్రబాబు నిద్రపోతుండగా ఉదయం ఆరు గంటలకు అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సు నుంచి చంద్రబాబును బయటకు పిలిచి అరెస్ట్ చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, ఎన్ఎస్‌జీ పర్యవేక్షణలోనే వస్తానని చంద్రబాబు చెప్పడంతో పోలీసులు అందుకు అంగీకరించి విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో వైద్య పరీక్షల అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 53 రోజుల పాటు జైల్లోనే ఉన్న చంద్రబాబు చివరకు అక్టోబర్‌ 31, 2023న విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారు. ఎన్నికల సమయంలో అవిశ్రాంతంగా అన్ని జిల్లాలను చుట్టేశారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయానికి చంద్రబాబు అరెస్ట్ కూడా దోహదం చేసిందన్నది నిజం. జైలులో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు. పైగా కూటమిలోకి బీజేపీని కూడా రప్పించారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటంతో వైసీపీ బాగా బలహీనపడింది. ఆ విధంగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు.

Eha Tv

Eha Tv

Next Story