టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది కేంద్ర హోంశాఖ, ఎన్‌ఎస్‌జీ కేంద్ర కార్యాలయానికి నివేదిక సమర్పించింది.

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌పై ఆయన ఎన్‌ఎస్‌జీ(NSG) భద్రతా సిబ్బంది కేంద్ర హోంశాఖ, ఎన్‌ఎస్‌జీ కేంద్ర కార్యాలయానికి నివేదిక సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరిగిన అరెస్టు(Arrest), ఏసీబీ కోర్టు రిమాండ్(ACB Court Remand), జైలులో భద్రత(Jail Security) తదితర అంశాలను నివేదికలో ప్రస్తావించింది. 9వ తేదీ ఉదయం 6 గంటలకు ఎన్‌ఎస్‌జీ ప్రొటెక్షన్‌(NSG Protction)గా ఉన్న ఆయనను సీఐడీ(CID) అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడ(Vijayawada)కు తరలించిన అంశాన్ని ప్రస్తావించింది.

10వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సిట్ కార్యాలయం(SIT Office), విజయవాడ జీజీహెచ్(Vijayawada GGH) అండ్ ఏసీబీ కోర్టు(ACB Court)కు తరలించినట్లు తెలిపింది. ఆ రోజు మొత్తం భద్రత లేకుండా కోర్టు హాలు బయటే ఉంచిన‌ట్లు నివేదిక‌లో పేర్కొంది. అదే రోజు రాత్రి 9.29 గంటలకు వర్షంలోనే రాజమహేంద్రవవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్ల‌డించింది.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ప్రస్తుతం ఆయనకు ఉన్న భద్రత గురించి కూడా ఎన్‌ఎస్‌జి ప్రస్తావించింది. జైలు ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో కొన్ని భద్రతా లోపాలు గమనించినట్లు పేర్కొంది. చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎన్‌ఎస్‌జి సిబ్బంది.. నివేదికను కేంద్ర హోంశాఖ, ఎన్‌ఎస్‌జి ప్రధాన కార్యాలయానికి సమర్పించింది.

Updated On 14 Sep 2023 11:56 PM GMT
Yagnik

Yagnik

Next Story