CM Jagan : మే 3న సీఎం జగన్ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటన
మే 3న సీఎం వైఎస్ జగన్ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టునున్నారు. విశాఖపట్నం మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్ధాపన చేయనున్నారు.
మే 3న సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) విజయనగరం(Vijayanagaram), విశాఖపట్నం(Vishakapatnam) జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం(Bogapuram) అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్(Chintapalli Fish Landing Center) నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టునున్నారు. విశాఖపట్నం మధురవాడ(Madhurawada)లో వైజాగ్ ఐటీ టెక్ పార్క్(Vizg IT Tech Park)కు శంకుస్ధాపన చేయనున్నారు.
విజయనగరం జిల్లా షెడ్యూల్
3వ తేదీ ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు చేరుకుంటారు, ఆ సెంటర్‌ను సందర్శిస్తారు, భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు. 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు.
విశాఖపట్నం షెడ్యూల్
మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి ఐటీ హిల్స్ నెంబర్ 4లో గల వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుంటారు. 2.30–3.00 వైజాగ్ ఐటీ టెక్ పార్క్ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు, అనంతరం పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. తర్వాత 3.50 గంటలకు అక్కడినుంచి బయలుదేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, 5.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.