CM Jagan Kurupam Tour : 28న సీఎం జగన్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటన
సీఎం వైఎస్ జగన్ ఈ నెల 28వ తేదీ బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు.

On 28th, CM Jagan visited Kurupam of Parvathipuram Manyam district
సీఎం వైఎస్ జగన్(CM Jagan) ఈ నెల 28వ తేదీ బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District) కురుపాం(Kurupam) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న అమ్మ ఒడి(Amma Vodi) పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్(CM Tour Schedule)ను విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి(Tadepalli) నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల(Chinamerangi Polytechnic College) హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి కురుపాం బహిరంగ సభ(Kurupam Public Meeting) వద్దకు చేరుకుని ప్రసంగం అనంతరం జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
