నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్ రాజ్ గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో హత్యకు గురయ్యారు.

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్ రాజ్ గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో హత్యకు గురయ్యారు. ధర్మవరంలోని చెరువులో అతడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హత్య చేసి మృతదేహాన్ని చెరువు పొదల్లో పడేశారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.

ధర్మవరం మండలం యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఆయన.. గత 20 ఏళ్లుగా హిందూపురంలో నివాసం ఉంటున్నారు. NSUI జాతీయ కార్యదర్శిగా పనిచేసిన ఆయన కేరళకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో సంపత్ కూడా పాల్గొన్నారు. హిందూపురంలో భూమి విషయంలో మరో లాయర్‌తో వివాదం ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి సంపత్ రాజ్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated On 30 May 2024 10:30 PM GMT
Yagnik

Yagnik

Next Story