NRI Student Sucide : కళాశాల అధికారుల వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
మంగళగిరి పరిధిలోని ఎన్ ఆర్ ఐ వైద్య కళాశాలలో(NRI Medical College) నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్(Kamepalli Venkata Pranav Yashwant) ఆత్మహత్య(Sucide) వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల(Fee) కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు సమాచారం. కళాశాల నిర్దేశించిన ఫీజు చెల్లించినప్పటికీ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న మాజీ ఐ పీ ఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు ( ఎం వి రావు) అదనంగా ఫీజు చెల్లించాలని వత్తిడి చేయటంతోనే యశ్వంత్ మంగళవారం
మంగళగిరి(Mangalagiri) ఎన్ ఆర్ ఐ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
వెలుగులోకి సంచలన విషయాలు
అధిక ఫీజు కోసం అడ్మినిస్ట్రేటర్ ఎం వి రావు(M V Rao) వేధింపులు
వేధింపులపై ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు విద్యార్థి ఫిర్యాదు...స్పందించని అధికారులు
మంగళగిరి పరిధిలోని ఎన్ ఆర్ ఐ వైద్య కళాశాలలో(NRI Medical College) నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్(Kamepalli Venkata Pranav Yashwant) ఆత్మహత్య(Sucide) వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల(Fee) కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు సమాచారం.
కళాశాల నిర్దేశించిన ఫీజు చెల్లించినప్పటికీ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న మాజీ ఐ పీ ఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు ( ఎం వి రావు) అదనంగా ఫీజు చెల్లించాలని వత్తిడి చేయటంతోనే యశ్వంత్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తనకు యాజమాన్యం నుంచి ఎదురౌతున్న అదనపు ఫీజు చెల్లింపు వేధింపుల గురుంచి రెండు నెల్ల క్రితమే యశ్వంత్ విజయవాడలోని ఎన్ టి ఆర్ వైద్య విశ్వ విద్యాలయం అధికారులతో పాటు, ఎన్ ఆర్ ఐ కళాశాల అధికారులకు లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదు.
దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే కఠిన నిర్ణయాన్ని యశ్వత్ తీసుకున్నారని సమాచారం. కళాశాల యాజమాన్యం ఫీజు వేధింపుల గురించి విశ్వ విద్యాలయ అధికారులకు చేసిన ఫిర్యాదు కాపీ యశ్వంత్ ఆత్మహత్య అనంతరం వెలుగులోకి వచ్చింది.
2019లో ఎన్ ఆర్ ఐ కళాశాలలో వైద్య విద్య చదివేందుకు మేనెజ్మెంట్ కోటాలో చేరిన తానూ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్దేశించిన గడువులోగా ముందుగా నిర్ణయించిన 33 లక్షల రూపాయల ఫీజు చెల్లిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబందించిన ఫీజు 33 లక్షల రూపాయలు ఏప్రియల్ 12వ తేదీన చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే కళాశాల అధికారులు అదనంగా మరో 12 లక్షలు చెల్లించాలని వత్తిడి చేశారని లేఖలో రాశారు.
ఈ మొత్తం చెల్లిస్తే ఫీజు ఏడాదికి 37 లక్షలు అవుతుందని... తానూ అంత మొత్తం చెల్లించలేనని నిస్సహాయత వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ కు తెలియచేశానని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే మొత్తం ఫీజు చెల్లించానని ఇక అదనపు చెల్లింపు తనవల్ల కాదని చెప్పినా వినకుండా ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందు అవమానించే విధంగా అవహేళన చేశారని లేఖలో తెలిపారు. ఫీజు విషయమై కళాశాల అడ్మినిస్ట్రేటర్ తో మాట్లాడాల్సిందిగా ప్రిన్సిపాల్ చెప్పారని, అదే సమయంలో అడ్మినిస్ట్రేటర్ ఆదేశాలతో తనపై చర్యలకు ప్రిన్సిపల్ ఉపక్రమించారని తెలిపారు.
ఫీజు మొత్తము చెల్లించిన తనపై ప్రిన్సిపల్ చర్య తీసుకోకుండా తీసుకోకుండా చూడాలని అభ్యర్ధించేందుకు అడ్మినిస్ట్రేటర్ ఎం వీ రావు ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఈ లేఖలో యశ్వంత్ తన ఆవేదనను విశ్వవిద్యాలయ అధికారులకు తెలిపారు. తనపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు కళాశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని, తానూ శ్రద్ధతో చదువుకోనివ్వకుండా మానసికంగా వేధిస్తూ తన భవిష్యత్తును సరిద్దిదుకోలేని విధంగా నష్టం చేస్తున్న,
వేధిస్తున్న ఎన్ ఆర్ ఐ కళాశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని తన లేఖలో యశ్వంత్ విశ్వ విద్యాలయ అధికారులను కోరారు. తనను వేధించకుండా, తనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేలా ఎన్ ఆర్ ఐ వైద్య కళాశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో యశ్వంత్ అభ్యర్ధించారు. ఈ లేఖ ప్రతిని యశ్వంత్ విశ్వవిద్యాలయ అధికారులతో పాటు, కళాశాల అడ్మినిస్ట్రేటర్, ప్రిన్సిపల్ కు ఈ ఏడాది జూన్ 23న పంపారు. వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవటంతో యశ్వంత్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని సన్నిహితులు చెప్తున్నారు.