Raghu Rama Krishnam Raju : మూడింటికీ చెడ్డ మూఢుడు రఘురామకృష్ణరాజు
పాపం రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju)ను చూస్తుంటే జాలేస్తోంది. ఆయనది అమాయకత్వమో, అహంకారమో, ఆభిజాత్యమో తెలియదు కానీ టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ(YCP Party)పై అడ్డదిడ్డంగా వాగారు. తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియాను చూసుకుని రెచ్చిపోయారు. అయినదానికి కానిదానికి తనతో లైవ్ ప్రోగ్రామ్‌లు పెడుతున్న ఛానెల్స్‌ను చూసి మురిసిపోయారు.
పాపం రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju)ను చూస్తుంటే జాలేస్తోంది. ఆయనది అమాయకత్వమో, అహంకారమో, ఆభిజాత్యమో తెలియదు కానీ టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ(YCP Party)పై అడ్డదిడ్డంగా వాగారు. తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియాను చూసుకుని రెచ్చిపోయారు. అయినదానికి కానిదానికి తనతో లైవ్ ప్రోగ్రామ్‌లు పెడుతున్న ఛానెల్స్‌ను చూసి మురిసిపోయారు. వారు కెమెరా, యాక్షన్ అనేసరికి జగన్(YS Jagan)ను విమర్శిస్తూ, టీడీపీని పొగుడుతూ పాతిక నిమిషాల పాటు విన్యాసాలు చేసేవారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కారణంగా నరసారపురం(Narasapuram) నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచారు. రాజీనామా చేయకుండా వైరిపార్టీల చంకనెక్కి కూర్చుకున్నారు. ఈసారి కూడా తాను నరసాపురం లోక్‌సభకు పోటీ చేస్తున్నానని, బరిలో దిగడం గ్యారంటీ అని, మళ్లీ విజయం సాధించడం కూడా పక్కానేనని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాననేది మాత్రం చెప్పకుండా నిన్నటి వరకు లాక్కొచ్చారు. ఎన్డీయే కూటమి(NDA Kutami) తరఫునే పోటీ చేస్తానని, అది తెలుగుదేశమా(TDP), జేజేపీనా(BJP), జనసేననా (Janasena)అన్నది తర్వాత చెబుతానని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఎటూ వెళ్లకుండా గోడమీద పిల్లిలా ఇంతకాలం ఉన్నారు. బీజేపీ తనను పిలిచి పీట వేసి శాలువా కప్పి బోకే ఇచ్చి టికెట్ ఇస్తుందని గంపెడాశతో ఉన్నారు టీడీపీ మీడియా ఇచ్చిన ట్రిపులార్ బిరుదాంకితుడు రఘురామకృష్ణరాజు..తీరా ఏమైంది.. 'పోవయ్యా పో.. నీలాంటి వాళ్లను సవాలక్షమందిని చూశాం' అంటూ బీజేపీ రఘురామను తీసి అవతలపడేసింది. తనకు టికెట్ ఇవ్వకపోతే సదరుపార్టీలకే నష్టం అన్నట్టుగా విర్రవీగారు రఘురామకృష్ణరాజు. ఇప్పుడు టికెట్ దక్కకపోయేసరికి డిలా పడ్డారు. వాడుకున్నంతకాలం చక్కగా వాడుకున్న టీడీపీ అనుకూల మీడియా కూడా రఘురామకృష్ణను లైట్ తీసుకుంది. గెలిపించిన వైసీపీకి వెన్నుపోటు పొడిచినందుకు రఘురామకృష్ణరాజుకు ఈ శాస్తి జరగాల్సిందేనని వైసీపీ క్యాడర్ అనుకుంటోంది.