ఈ ఏడాది బెంగళూరులో నమోదైన ఉగ్రవాద కుట్ర కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ

ఈ ఏడాది బెంగళూరులో నమోదైన ఉగ్రవాద కుట్ర కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) మంగళవారం వివిధ రాష్ట్రాల్లోని 11 చోట్ల సోదాలు మొదలుపెట్టింది.అనంతపురం జిల్లాలో NIA రైడ్స్ జరగడంతో జిల్లా మొత్తం అవాక్కయింది. రాయదుర్గం పట్టణంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్లా ఇంట్లో NIA తనిఖీలు చేపట్టింది.

అబ్దుల్లా కుమారులు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు. గత కొంతకాలంగా అబ్దుల్లా కుమారులు కనిపించడం లేకపోవడంతో వారి గురించి ఆరాతీయడం మొదలు పెట్టారు. వారికి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న కోణంలో NIA దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే నాగులబావిలో తండ్రి అబ్దుల్ ఇంట్లో సోదాలు చేసిన NIA అధికారులు.. అబ్దుల్ ను అతని మరో కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

Updated On 21 May 2024 1:03 AM GMT
Yagnik

Yagnik

Next Story