హైదరాబాద్ విద్యానగర్‌కు చెందిన న్యాయవాది సురేష్(Advocate suresh) ఇంట్లో ఎన్ఐఏ సోదాలు(NIA Rides) ముగిశాయి. ఈ సోదాల‌లో కేసులకు సంబంధించిన పత్రాలను ఎన్ఐఏ సీజ్ చేసిన‌ట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ విద్యానగర్‌కు చెందిన న్యాయవాది సురేష్(Advocate suresh) ఇంట్లో ఎన్ఐఏ సోదాలు(NIA Rides) ముగిశాయి. ఈ సోదాల‌లో కేసులకు సంబంధించిన పత్రాలను ఎన్ఐఏ సీజ్ చేసిన‌ట్లు తెలుస్తుంది. గతంలో మావోలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై విశాఖలో కేసులు(Vishakapatnam Case) నమోదయ్యాయి. ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసిన ఏపీ పోలీసులు(AP Police).. ఎన్ఐఏకు బదిలీ చేశారు. అయితే.. విశాఖపట్నం కేసును క్వాష్ చేయాలంటూ న్యాయవాది సురేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమ‌వారం ఎన్ఐఏ అధికారులు సురేష్ కుమార్ ఇంట్లో సోదాలు చేసి అనుమానస్పద డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తుంది. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ న్యాయవాది సురేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Updated On 2 Oct 2023 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story