వివాహబంధంలో అడుగుపెట్టి అయిదు రోజులైంది.. కొత్త జీవితంపై వధువు ఎన్నో కలలు కన్నది. కారణమేమిటో తెలియదు కానీ నవ దంపతులు గోదావరిలో దూకారు. వరుడు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. వధువు మాత్రం గల్లంతయ్యింది. పెనుగొడ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగిన ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి.

వివాహబంధంలో అడుగుపెట్టి అయిదు రోజులైంది.. కొత్త జీవితంపై వధువు ఎన్నో కలలు కన్నది. కారణమేమిటో తెలియదు కానీ నవ దంపతులు గోదావరిలో దూకారు. వరుడు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. వధువు మాత్రం గల్లంతయ్యింది. పెనుగొడ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగిన ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కె.శివరామకృష్ణ, వడలికి చెందిన కోరాడ సత్యవాణి వివాహం డిసెంబర్‌ 15వ తేదీన వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి కొత్త దంపతులు సినిమాకు వెళుతున్నామని చెప్పి వడలి నుంచి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సిద్ధాంతం వంతెన దగ్గర వారి ద్విచక్రవాహనం, వరుడు ఈదుకుని వచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నాయి. గల్లంతైన వధువు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు తణుకులోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి శివరామకృష్ణను తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అమ్మాయిని శివరామకృష్ణే ఏదో చేసి ఉంటాడని, ఇప్పుడు డ్రామా ఆడుతున్నాడని వధువు తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసల విచారణలో నిజాలు తెలిసే అవకాశం ఉంది.

Updated On 21 Dec 2023 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story