తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు(Chandrababu) కుప్పం(Kuppam) నియోజకవర్గంలో తిరుగులేదని అనుకుంటున్నారు చాలా మంది! చాలా మందిలో ఆయన సామాజికవర్గం వారే ఎక్కువగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కుప్పంలో ఆయన ఎదురీదుతున్నారనే మాట వినిపిస్తోంది.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు(Chandrababu) కుప్పం(Kuppam) నియోజకవర్గంలో తిరుగులేదని అనుకుంటున్నారు చాలా మంది! చాలా మందిలో ఆయన సామాజికవర్గం వారే ఎక్కువగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కుప్పంలో ఆయన ఎదురీదుతున్నారనే మాట వినిపిస్తోంది. ఓటమి భయంతోనే చంద్రబాబు నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నారని కొందరు అంటున్నారు. రెండేళ్ల నుంచి చంద్రబాబుకు ఈ భయం పట్టుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(Congress) పార్టీ తనను టార్గెట్‌ చేసిందని చంద్రబాబుకు అవగతమయ్యింది. అందుకే నష్టనివారణకు దిగారు. గత ఎన్నికల్లోనే(Elections) చంద్రబాబుకు కుప్పంలో చాలా వరకు మెజారిటీ తగ్గిందన్న సంగతి తెలిసిందే! నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉందని, మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టానని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు ఇన్నాళ్లకు పరాజయం వణుకు మొదలయ్యింది. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) ప్రభుత్వం అప్పట్నుంచే అక్కడ పాగా వేసింది. అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గొప్ప ఫలితాలను సాధించలేకపోయింది. చంద్రబాబును ఓడిస్తే ఇక టీడీపీ మళ్లీ కోలుకోలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ భావిస్తోంది. చాలా కాలంలో కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు ఇప్పటి వరకు ప్రచారానికి వెళ్లలేదు. నామినేషన్‌ పత్రాలు కూడా చంద్రబాబు తరఫున ఎవరో ఇచ్చేవారు. చంద్రబాబు అక్కడికి వెళ్లేవారు కాదు! ఈసారి మాత్రం తన ఎన్నికల ప్రచారాన్ని కుప్పం నుంచి ప్రారంభించారు చంద్రబాబు. ఎన్నడూ తన భర్త తరఫున ప్రచారం చేయని భువనేశ్వరి ఇప్పుడు ఆయన గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ఇంతగా చంద్రబాబు ఫ్యామిలీ కష్టపడుతున్నది ఎందుకంటే కుప్పంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తున్నదనే మాట వినిస్తుండటమే! ఓటమి భయంతోనే చంద్రబాబు కుప్పాన్ని విడిచిపెట్టి మరో చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ చంద్రబాబు ఆ పని చేస్తే పార్టీపై పెను ప్రభావం చూపుతుందనే భయంతో వెనుకాడారు. త‌ను కుప్పం నుంచి నిల‌బ‌డ‌టం ఇదే చివ‌రిసారి అని, ఈ సారి త‌న గెలుపుకు స‌హ‌క‌రించమని స్థానిక నేతలతో చెబుతున్నారట! తనను గెలిపిస్తే వచ్చేసారి టికెట్‌ మీకేనని వారిని ఆశపెడుతున్నారట! మొత్తం మీద గెలుపు కోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు చంద్రబాబు!

Updated On 22 April 2024 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story