Tirumala Brahmotsavam : హనుమంత వాహనంపై శ్రీమలయప్పస్వామి
తిరుమలలో(Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navrathri Bramhostavam) నేత్రపర్వంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చారు. ఆరవ రోజు, శుక్రవారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన(Hanumantha Vahanam) సేవ నిర్వహించారు.
తిరుమలలో(Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navrathri Bramhostavam) నేత్రపర్వంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చారు. ఆరవ రోజు, శుక్రవారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన(Hanumantha Vahanam) సేవ నిర్వహించారు. మలయప్పస్వామి(Malayappa Swamy) హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారి వాహన సేవను తిలకించారు. హనుమంతుడు శ్రీరాముని నమ్మినబంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలను అందించిన ఆ భక్తుడిని శ్రీవారు మర్చిపోతారా? అందుకే ఆ బంటుకు మళ్లీ తన సేవా భాగ్యాన్ని అందించింది. ఆ దివ్య దృశ్యాన్ని చూడాలే తప్ప వర్ణించడం వీలు కాదు.. అంతే కాదు. తాను కూడా ఆ మహా విష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియచెప్పే మధురమైన సన్నివేశమది..మరోవైపు ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహనసేవ, సాయంత్రం నాలుగు గంటలకు అత్యంత విశేషమైన పుష్పక విమాన సేవ జరగనున్నట్లు టీడీడీ అధికారులు తెలిపారు. మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమాన సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.