తిరుమల(Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navratri Brahmotsavam) వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అయిదో రోజు గురువారం ఉదయం శ్రీమలయప్పస్వామి(Malayappa Swamy) మోహిన(Mohini) రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు.

తిరుమల(Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navratri Brahmotsavam) వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అయిదో రోజు గురువారం ఉదయం శ్రీమలయప్పస్వామి(Malayappa Swamy) మోహిన(Mohini) రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు.
మోహినీ అవతారం అంటే మాయా మోహ నాశ‌నం అని చరిత్ర చెబుతోంది.ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత వుంది.మిగిలిన అన్ని వాహన సేవలు స్వామి వారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతారం ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.

Updated On 19 Oct 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story