Big Shock to AP Government : కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా పై స్పందించిన N.G.T.
శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా పై స్పందించిన N.G.T.జయమంగలి మరియు పెన్నా నదుల పరివాహ ప్రాంతాలలో వేలాది వాహనాలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ జై భీమ్ రావ్ భారత్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎన్ నాగరాజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అప్లికేషన్ దాఖలు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్డే అంజనప్ప మరియు వడ్డే నవీన్ ప్రతి వాదులుగా పేర్కొన్న పిటిషనర్.అధికారుల అండదండలతో కోట్లాది రూపాయల విలువ చేసే ఇసుకను కూటమినేతలు అక్రమంగా రవాణా చేస్తున్నారని పిటిషన్.నదీ పరివాహ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ & జియాలజీ మరియు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన పిటీషనర్. ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకపోయినా వేలాది వాహనాలతో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నరు.పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్.తక్షణమే ట్రిబ్యునల్ స్పందించకపోతే రాజకీయ నాయకుల అండదండలతో నదీ పరివాహ ప్రాంతాలలో ఇసుక మొత్తాన్ని అక్రమ రవాణా చేస్తారని న్యాయస్థానాన్ని కోరినశ్రావణ్ కుమార్.అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తక్షణమే నదీ పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది అని న్యాయస్థానాన్ని కోరిన జడ శ్రావణ్ కుమార్.రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా నిలువరించటానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి అన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.జయమంగలి మరియు పెన్నా నది పరివాహ ప్రాంతాలలో ఎటువంటి ఇసుక అక్రమ రవాణా చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్జీటీ కు హామీ ఇచ్చిన ప్రభుత్వ న్యాయవాది.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో వడ్డే అంజనప్ప మరియు వడ్డే నవీన్ కు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.తెలుగుదేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు వడ్డే అంజనప్ప మరియు వడ్డే నవీన్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన ఎన్జీటీ.ప్రిన్సిపల్ సెక్రెటరీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ మరియు శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ ను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశాలు.కేసుని మార్చి మూడవ తారీకుకు వాయిదా వేసిన ఎన్జీటీ.ఎన్జిటి ఆదేశాలతో కదలనున్న ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ యంత్రాంగం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకుల అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో అయినా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన పిటిషనర్ ఎన్ నాగరాజు.రాష్ట్రంలో ప్రతి ఇసుక దందాను జై భీమ్ రావు భారత్ పార్టీ అడ్డుకుంటుందని, ప్రకృతి వనరులు పరిరక్షించటం తమ పార్టీ విధానపరమైన నిర్ణయం అని తెలియజేసిన పార్టీ నాయకులు.శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా మరియు నదీ పరివాహక ప్రాంతాల పరిరక్షణ తమ పార్టీ విధానపరమైన నిర్ణయమని కచ్చితంగా తమ పార్టీ, నదులను పరిరక్షించడంలో ఎంత దూరమైనా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తుందని తెలియజేసిన జిల్లా నాయకులు.