Naralokesh Mulakhat With Chandrababu : రాజమండ్రి చేరుకున్న లోకేష్.. కాసేపట్లో బాబుతో భేటీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న నారా లోకేష్.. శుక్రవారం ఉదయం అమరావతి నుంచి రాజమండ్రి బయలుదేరారు. అయితే.. లోకేష్‍ని కలిసేందుకు వెళ్తున్న కార్యకర్తల వాహనాలపై పోలీసుల ఆంక్షలు విధించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Naralokesh Mulakhat With Chandrababu
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న నారా లోకేష్.. శుక్రవారం ఉదయం అమరావతి నుంచి రాజమండ్రి బయలుదేరారు. అయితే.. లోకేష్‍ని కలిసేందుకు వెళ్తున్న కార్యకర్తల వాహనాలపై పోలీసుల ఆంక్షలు విధించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. లోకేష్ వెంట నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ నేడు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబుతో భేటీ కానున్నారు. సెప్టెంబర్ 14న చివరిసారి లోకేష్ తండ్రితో భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణలతో కలిసి జైల్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు 22 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకున్న టీడీపీ నేత నారా లోకేశ్.. శుక్రవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అవుతారు.
