ఆంధప్రదేశ్‌ రాజకీయాలు(AP Politics) క్రమంగా వేడేక్కుతున్నాయి. పార్టీలు అభ్యర్థుల ఎన్నికల వాతావరణం వచ్చేసింది. పార్టీలు అభ్యర్థుల తీసివేతలు, కూడికలతో బీజీ అయ్యాయి. ప్రతీ పార్టీకి అభ్యర్థుల మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయ. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌(Congress) పార్టీ మొదలుపెట్టిన అభ్యర్థుల మార్పు ఫార్ములాను ఇప్పుడు అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. అధికార పార్టీ అయిన వైసీపీ(YCP) ఏకంగా 38 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

ఆంధప్రదేశ్‌ రాజకీయాలు(AP Politics) క్రమంగా వేడేక్కుతున్నాయి. పార్టీలు అభ్యర్థుల ఎన్నికల వాతావరణం వచ్చేసింది. పార్టీలు అభ్యర్థుల తీసివేతలు, కూడికలతో బీజీ అయ్యాయి. ప్రతీ పార్టీకి అభ్యర్థుల మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయ. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌(Congress) పార్టీ మొదలుపెట్టిన అభ్యర్థుల మార్పు ఫార్ములాను ఇప్పుడు అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. అధికార పార్టీ అయిన వైసీపీ(YCP) ఏకంగా 38 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 40 అసెంబ్లీ నియోజకవర్గాల వరకూ అభ్యర్థులను మార్చవచ్చని ఇంతకుమునుపు అనుకున్నారు కానీ ఇప్పుడా సంఖ్య 60 వరకు చేరిందని వినికిడి. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఆల్‌రెడీ కబురు అందిందట! మరోవైపు తెలుగుదేశంపార్టీ(TDP) కూడా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబునాయుడు(chandrababu) కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధానక కార్యదర్శి నారా లోకేశ్‌(Naralokesh) ఈసారి మంగళగిరిలో(Mangalagiri) పోటీ చేయడం లేదట! ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గాన్ని ఎంచుకున్నారట! తాను మంగళగిరిలోనే మళ్లీ పోటీచేస్తానంటూ ఆ మధ్య ప్రకటించిన లోకేశ్‌ ఎందుకైనా మంచిదని క్షేమదాయకమైన నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈసారి హిందూపురం(Hindupuram) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోకేశ్‌ పోటీచేయబోతున్నారు. అలాగైతే మామ నందమూరి బాలకృష్ణ సంగతేమిటి? అంటే ఆయన ఈసారి హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగబోతున్నారట! అల్లుడి కోసం ఆ మాత్రం త్యాగం చేయరా ఏమిటి? సర్వేలకు అనుగుణంగానే మామఅల్లుళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారట!

Updated On 8 Jan 2024 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story