తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు.. టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న తెలిపారు. నారా లోకేష్ కు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇవ్వాలని, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలన్నారు. పార్టీ కోసం లోకేష్‌ 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. చంద్రబాబు జైల్లో ఉంటే పార్టీని కాపాడేందుకు పాదయాత్రకు విరామం ప్రకటించి ఢిల్లీ వెళ్లి లాయర్లతో సమావేశమయ్యారన్నారు. పార్టీని కాపాడే శక్తి లోకేష్ కు ఉందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 130కిపైగా స్థానాల్లో గెలుస్తుందని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారని చెప్పారని.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే టీడీపీ బాధ్యతలు లోకేష్‌కి అప్పగించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టినా భయపడని అచ్చెన్నాయుడుకు ప్రమోషన్ ఇవ్వాలని బుద్దా వెంకన్న చంద్రబాబును కోరారు. ఆయనకు కేబినెట్‌లో కీలక మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.

Updated On 24 May 2024 2:24 AM GMT
Yagnik

Yagnik

Next Story