Nara Lokesh Sholder Injury In Padayatra : నారా లోకేశ్‌కు తీవ్ర గాయాలు.. పాదయాత్రకు బ్రేక్.?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ భుజాలకు గాయాలయ్యాయి. ఆయన రెండు భుజాలకు గాయాలయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వీడ్కోలు కార్యక్రమం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాదయాత్రకు స్వాగత కార్యక్రమం వెంటవెంటనే ఉండటంతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Nara Lokesh Sholder Injury In Padayatra
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ భుజాలకు గాయాలయ్యాయి. ఆయన రెండు భుజాలకు గాయాలయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వీడ్కోలు కార్యక్రమం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాదయాత్రకు స్వాగత కార్యక్రమం వెంటవెంటనే ఉండటంతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారీగా వచ్చిన పార్టీ కార్యకర్తలను పోలీసులు నిలవరించలేకపోయారు. కార్యకర్తల తోపులాటలోనే లోకేష్‌కు గాయాలయ్యాయి. గాయం కారణంగానే సెల్ఫీలు కూడా తీసుకోలేకపోయారు లోకేష్. ఇతరుల సాయంతో లోకేష్ సెల్ఫీలు తీయిస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రం లోకేష్ వైద్య చికిత్సకు వెళ్లనున్నారు. ఇప్పటికే కొందరు డాక్టర్లు లోకేష్ గాయాలను పరిశీలించి ప్రాథమిక చికిత్సను అందించారు.
