రాష్ట్రంలో టీడీపీ(TDP) శ్రేణుల నిరసనలపై సీఎం జగన్(CM Jagan) వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఖండించారు. జనం రోడ్డెక్కితే సీఎం జగన్ జడుసుకుంటున్నార‌ని.. నిరసనల(protests) మాట వింటే ఉలిక్కి పడుతున్నార‌ని అన్నారు.

రాష్ట్రంలో టీడీపీ(TDP) శ్రేణుల నిరసనలపై సీఎం జగన్(CM Jagan) వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఖండించారు. జనం రోడ్డెక్కితే సీఎం జగన్ జడుసుకుంటున్నార‌ని.. నిరసనల(protests) మాట వింటే ఉలిక్కి పడుతున్నార‌ని అన్నారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే.. ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుపై(Chandrababu Arrest), తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్ పిరికితనాన్ని చాటిచెపుతోంద‌ని లోకేష్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన అంగన్ వాడీలపై నిన్న పోలీసుల నిర్బంధం తీరు నిర్ఘాంతపరిచిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన ఆ మహిళలపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, వ్యతిరేక గళాలు ఉంటాయన్న విషయం జగన్ తెలుసుకోవాల్సి ఉంది. అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, నేతలపై పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అతి త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి పాడెకడతారు అని లోకేష్ హెచ్చరించారు.

Updated On 26 Sep 2023 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story