Nara Lokesh Press Meet : రాష్ట్రపతిని కలిసిన తర్వాత లోకేష్ సంచలన వ్యాఖ్యలు
నారా లోకేశ్(Nara Lokesh) రాష్ట్రపతి(Governor) ద్రౌపది ముర్ముతో(Draupadi Murmu) సమావేశం అయ్యారు. టీడీపీ(TDP) ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో సమావేశమైన లోకేష్ అనంతరం మాట్లాడుతూ.. 2019 నుంచి ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై జరిగిన అరాచకాలపై రాష్ట్రపతికి వివరించామని తెలిపారు.
నారా లోకేశ్(Nara Lokesh) రాష్ట్రపతి(president) ద్రౌపది ముర్ముతో(Draupadi Murmu) సమావేశం అయ్యారు. టీడీపీ(TDP) ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో సమావేశమైన లోకేష్ అనంతరం మాట్లాడుతూ.. 2019 నుంచి ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై జరిగిన అరాచకాలపై రాష్ట్రపతికి వివరించామని తెలిపారు. టీడీపీ నాయకులను జైలుకు పంపిన తీరు గురించి రాష్ట్రపతికి వివరించామని పేర్కొన్నారు. స్కిల్ కేసులో(Skill Development Case) చంద్రబాబును రిమాండ్ కు పంపారని చెప్పామని వివరించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నాకేం సంబంధం ఉందని అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావడం లేదని అన్నారు. రోజుకో వదంతు, రోజుకో కేసులతో వేధిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నా పేరు కూడా చేర్చారు.. తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ కేసులు పెట్టి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. మేము న్యాయ పోరాటం చేస్తాం.. మేం ఏ తప్పూ చేయలేదని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుకి మద్దతు వస్తోందని.. చంద్రబాబుకి మద్దతుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి ఏపీలో అరాచకాలపై వివరించామని తెలిపారు. యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తానని.. కేసులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.