Nara Lokesh Sensational Tweet : చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు
సీఎం జగన్‌పై(CM Jagan) టీడీపీ(TDP) జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విటర్(Twitter) వేదికగా ఆయన.. సైకో జగన్(Psycho Jagan) చంద్రబాబుని(Chandrababu) అక్రమ అరెస్ట్ చేయించింది.. జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయని సంచలన ఫోస్టు చేశారు.

Nara Lokesh Sensational Tweet
సీఎం జగన్‌పై(CM Jagan) టీడీపీ(TDP) జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విటర్(Twitter) వేదికగా ఆయన.. సైకో జగన్(Psycho Jagan) చంద్రబాబుని(Chandrababu) అక్రమ అరెస్ట్ చేయించింది.. జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయని సంచలన ఫోస్టు చేశారు. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని అన్నారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదని.. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా.. జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. చంద్రబాబును ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత అని హెచ్చరించారు.
సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9
— Lokesh Nara (@naralokesh) September 21, 2023
